Breaking News

వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన..10 మందికే అనుమతి!

Published on Mon, 07/28/2025 - 18:54

విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై కూటమి ప్రభుత్వం మరోసారి కక్ష సాధింపు చర్యలకు దిగింది. వైఎస్‌ జగన్‌ ఏ పర్యటన చేపట్టినా జనం ప్రభంజనంలా తరలి రావడాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జనాన్ని నియంత్రించాలని చూస్తోంది. 

ఇందులో భాగంగా ఈనెల 31వ తేదీన (గురువారం) వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటనపై ఆంక్షలు విధించింది. కేవలం పది మందికి మాత్రమే అనుమతి అంటూ పోలీసులతో నోటీసులు ఇప్పించింది చంద్రబాబు సర్కారు. వైఎస్‌ జగన్‌ హెలీప్యాడ్‌ వద్ద కేవలం పది మంది మాత్రమే ఉండాలని నోటీసుల్లో పేర్కొంది. 

వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటనలో భాగంగా  జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ నేత కాకాణితో వైఎస్‌ జగన్‌ ములాఖత్‌ కానున్నారు. ఇక్కడకు కూడా జనం రాకూడదని ఆంక్షలు విధించింది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి వైఎస్‌ జగన్‌ వెళ్లే క్రమంలో కూడా జనానికి అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం కాన్వాయ్‌లకు మాత్రమే అనుమతి ఉందని, జనం పది మంది మించి రావడానికి వీల్లేదని నోటీసుల్లో స్పష్టం చేశారు. 

జగన్‌ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉండటంతో కూటమి సర్కారు భయభ్రాంతులకు గురౌవుతుంది., అందుకే ఆంక్షలతో వైఎస్‌ జగన్‌ జనాభిమానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. 

అప్పుడు హెలీప్యాడ్‌కు అనుమతి లేదంటూ..
జులై 3న వైఎస్‌ జగన్  చేపట్టాల్సిన నెల్లూరు పర్యటనకు సైతం అ‍డ్డంకులు సృష్టించింది కూటమి సర్కారు.  హెలీప్యాడ్‌కు అనుమతి ఇవ్వకుండా కుట్రలకు తెరలేపింది.  గత నెల 27న వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్సార్‌సీపీ నేతలు దరఖాస్తు చేశారు.

 ఆ సమయంలో హెలిప్యాడ్‌కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కల్గించారు. ఇప్పుడు పది మంది మాత్రమే రావాలంటూ ఆంక్షల పర్వాన్ని తెరపైకి తెస్తూ మరోమారు నోటీసులు ఇవ్వడం వైఎస్‌ జగన్‌ పర్యటనను ఏదో రకంగా అడ్డుకోవాలని చూడటమేనని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)