Breaking News

హరిత హోటల్‌ వేదికగా ఎల్లో పాలిటిక్స్‌.. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

Published on Sat, 08/09/2025 - 19:41

కడప:  ఒంటిమిట్టలో యధేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరుగుతున్నా అధికారులు మాత్రం పత్తా లేకుండా ఉన్నారు. హరిత హోటల్‌ వేదికగా తిష్ట వేసిన మంత్రులు.. ఎల్లో పాలిటిక్స్‌కు తెరలేపారు. హరిత హోటల్‌ను కూటమి కార్యాలయంగా మార్చేశారు మంత్రులు, టీడీపీ నేతలు. హరిత హోటల్‌లో మకాం వేసి మంత్రులు.. పచ్చదండు కార్యకర్తలతో బహిరంగ సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

మంత్రులు మంత్రులుగా వ్యవహరిస్తున్న తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు పార్టీ కోసం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే కాకుండా, అదే సమయంలో ప్రభుత్వ వాహనాలను సైతం ఉపయోగిస్తున్నారు. మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నికల కోడ్‌ వర్తించకపోవడం ఇక్కడ గమనార్హం, ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు మాత్రం పత్తాలేకుండా ఉన్నారు. 

ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక వైఎస్సార్‌సీపీకి అనుకూలమనే సంకేతాలతో టీడీపీ అధిష్టానం రాష్ట్ర కేబినెట్‌ను ఇక్కడికి పంపుతోంది . రోజుకొక మంత్రి వస్తున్నారు. ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం కేబినెట్‌ కదిలిరావడం చూసి ఓటర్లు ఆశ్చర్యచకితులవుతున్నారు. కులాలవారీగా మంత్రులను రంగంలోకి దింపుతున్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, ఫరూఖ్‌లు ఒంటిమిట్టలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. పోలింగ్‌ నాటికి ఎంతమంది మంత్రులు దిగుతారో చెప్పలేని పరిస్థితి. తమవంతుగా జనసేన నుంచి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌,ఎమ్మెల్సీ అనురాధలు ఉన్నారు.

కాగా, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కొన్ని పరిమితులతో కూడిన అంశం. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తమ అధికారాన్ని, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయకూడదు. మరి మంత్రులు తమ హోదాలో ఇంత చేస్తున్నా ఎన్నికల అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)