Breaking News

చంద్రబాబు భద్రత ప్రభుత్వం బాధ్యత: హోంమంత్రి

Published on Tue, 09/12/2023 - 14:54

సాక్షి, విశాఖపట్నం: తనను అరెస్ట్‌ చేయాలని లోకేష్‌ పదేపదే చెప్పనక్కర్లేదని.. నేరం రుజువైతే అరెస్ట్‌ తప్పదని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కోసం చట్టాలు, జైలు రూపొందించలేదన్నారు. జైళ్లలో అన్ని రకాల నేరస్తులు ఉంటారు. రాజమండ్రి జైలుల్లో చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పించాం.. ఆయనకు ఇంటి భోజనం కూడా అందిస్తున్నారు. మావోయిస్టుల నుంచి జైలులో చంద్రబాబుకు ఏ ఇబ్బంది లేదు.. ఆయన భద్రత ప్రభుత్వం బాధ్యత. లోకేష్‌, పవన్‌, బాలకృష్ణ వారి పని వారు చేసుకోవచ్చు’ అని  తానేటి వనిత అన్నారు.

‘‘రోడ్డెక్కి ప్రజలను రెచ్చగొడితే చర్యలు తప్పవు. చంద్రబాబు ఉన్న గది పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. చంద్రబాబు అనుమతితోనే ఎవరినైనా ఆయన వద్దకు పంపించడం జరుగుతుంది. చంద్రబాబు సామాన్య వ్యక్తి కాదు... 14 ఏళ్ల సీఎం.. సాక్ష్యాలు లేకుండా అతన్ని సీఐడీ అరెస్టు చేయదు. స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న సాక్ష్యాలు ఉండబట్టే ఆయన్ను సీఐడీ అరెస్టు చేసింది’’ అని హోంమంతి పేర్కొన్నారు.

‘‘జైళ్ళలో ఉద్యోగుల కేడర్ బట్టి విధులు కేటాయించడం జరుగుతుంది.. అంతేగాని బంధుత్వం బట్టి జరగదు.. నంద్యాల నుంచి సుఖంగా చాపర్‌లో తీసుకువెళ్తామని సీఐడీ చెప్తే వినకుండా రోడ్డు మార్గంలో ప్రజల్ని రెచ్చగొట్టేందుకు చంద్రబాబు వచ్చారు. టీడీపీ నాయకులు కావాలనే అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ చెప్పే మాటల్లో స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాంలో ప్రమేయం లేదని ఉందా?. పోలీసులు సంయమనంతో ఉండడంవల్ల ఏపీలో శాంతియుతంగా ఉంది. స్కిల్ కుంభకోణంలో కేవలం చంద్రబాబు నాయుడు రిమాండ్‌కి తీసుకున్నారు. విచారణకు చంద్రబాబు సహకరిస్తే అసలు విషయాలు బయట పడతాయి’’ అని హోంమంత్రి తానేటి వనిత అన్నారు.



చదవండి: లోకేష్‌కు కోపం వస్తే లోకం వణికిపోతుందా? 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)