Breaking News

‘దళితులకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఆదుకున్నది మా ప్రభుత్వమే’

Published on Tue, 06/27/2023 - 13:28

సాక్షి,  తూర్పుగోదావరి జిల్లా:  దళితులపై అత్యాచారాలు,హత్యలు అంటూ ఈనాడులో  ప్రచురించిన వార్తలపై హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు.దళితులకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే ఆదుకున్నది తమ ప్రభుత్వమేనని తానేటి వనిత స్పష్టం చేశారు. దళితులకు అత్యధిక భద్రత కల్పిస్తుంది కూడా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని హోంమంత్రి మరోసారి గుర్తు చేశారు.

‘దళితులపై దాడులు జరిగిన ఘటనలకు సంబంధించి వెను వెంటనే చర్యలు తీసుకున్నాం. బాధితులకు న్యాయం జరిగేలా చేసాం. ఈ విషయాలు ఈనాడుకు పట్టవా... వాటిని ఎందుకు ప్రచురించడం లేదు?, చంద్రబాబు హయాంలో ఎన్నో దారుణాలు జరిగాయి అప్పుడు దళితులపై జరిగిన దాడులకు సంబంధించి పచ్చ మీడియా ఎందుకు ప్రశ్నించలేదు. టిడిపి హయాంలో దళితులపై దాడులకు సంబంధించి రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది.  దళితులను అన్ని రకాలుగా ఆదుకున్నది సీఎం జగనన్నే అని చెప్పడంలో సందేహమే లేదు.

రాజకీయంగా ,సామాజికంగా ఎన్నో అవకాశాలు కల్పించారు.  దళితులకు అత్యధిక భద్రతను కల్పిస్తుంది కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. నాలాంటి సాధారణ దళిత మహిళలకు రాష్ట్ర హోం మంత్రిగా అవకాశం కల్పించింది జగనన్నే. టిడిపి హయాంలో దళితులకు హోం మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలి. ఒకటి రెండు సంఘటన బూచిగా చూపించి వైఎస్సార్ సీపీకి దళితులను దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.అది ఎప్పటికీ సాధ్యం కాదు’ అని తెలిపారు.

చదవండి: మార్గదర్శి’లాంటి స్కాం ఇప్పటివరకు జరగలేదు 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)