Breaking News

AP Congress: కాంగ్రెస్‌ చీఫ్‌ షర్మిలకు షాక్‌

Published on Fri, 06/21/2024 - 14:10

సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిలకు బిగ్‌ షాక్‌ తగిలింది. షర్మిల నాయకత్వంపై ఏపీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ సుంకర పద్మశ్రీ, రాకేష్‌ రెడ్డిలు ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో, ఏపీ కాంగ్రెస్‌లో ముసలం చోటుచేసుకుంది.

కాగా, ఫిర్యాదులో భాగంగా కాంగ్రెస్‌ నేతలు..‘ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరగలేదు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో క్విడ్ ప్రోకో మాదిరిగా వ్యవహరించారు. వీరి పోకడల కారణంగా కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడింది. అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం అందించిన నిధులు సైతం గోల్ మాల్ అయ్యాయి. అధిష్టానం షర్మిలని ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా నియమించినపుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని చాలా నమ్మకం పెట్టుకున్నాం.

కానీ, ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడలకు పోయి పార్టీకి నష్టం చేకూర్చారు. సమర్థులైన వారికి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు. షర్మిల అవగాహన రాహిత్యం కాంగ్రెస్ పార్టీ కేడర్, నాయకులను నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. తెలంగాణకు చెందిన షర్మిలకి చెందిన కొందరు అనుయాయులు ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల టికెట్ అంశాల్లో జోక్యం చేసుకున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి బీ ఫామ్స్‌ కేటాయించారు. సీడబ్ల్యూసీ మెంబర్స్‌, సీనియర్‌ నాయకులు, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌, డీసీసీ ప్రెసిడెంట్స్‌ సూచనలను షర్మిల పరిగణనలోకి తీసుకోలేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు.. తాజాగా షర్మిల మరో కీలక నిర్ణయం ప్రకటించారు. పార్టీలో కొనసాగుతున్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే పార్టీ కమిటీలను తిరిగి ఏర్పాటు చేస్తామని షర్మిల స్పష్టం చేశారు. షర్మిల నిర్ణయం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)