Breaking News

ఏపీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం: సీఈవో ముఖేష్‌ కుమార్‌

Published on Sat, 03/16/2024 - 16:51

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనునట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఏపీలో మే 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఏపీలో 46 వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరుపుతామని, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఫామ్‌ 12 ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయవచ్చన్నారు. 85 ఏళ్లు దాటిన వారికి ఓటు ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఓటరు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డులు చూపించొచ్చని వెల్లడించారు.

►ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్
►ఏప్రిల్ 18 నుంచి 25 వరుకు నామినేషన్ల స్వీకరణ
►ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
►ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు
►మే 13న పోలింగ్‌
►జూన్ 4న ఓట్ల లెక్కింపు
►ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్ధానాలకు ఎన్నికలు
►ఏపీలో  తాజా ఓటర్ల సంఖ్య 4,09,37,352...ఇందులో సర్వీస్ ఓటర్లు సంఖ్య 67393
►18 నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన 9,01,863 మంది ఓటర్లు వున్నారు
►ఏపీలో జనవరి ఒకటి నాటికి 4.07 కోట్ల మంది ఓటర్లు ఉంటే.. తాజాగా 1,97,000 మంది పెరిగారు
►ఈ రోజు వరకు వచ్చిన 6ఏ దరఖాస్తులు తీసుకుంటాం
►ఏపీలో 46165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి
►ఇందులో 179 పోలింగ్ కేంద్రాలు ప్రత్యేకంగా మహిళా పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తాం
►పోలింగ్‌కు ఐదు రోజుల ముందు ఓటర్ల స్లిప్ కూడా పంపిణీ చేస్తాం
►ఎపిక్ కార్డులు లేకపోతే పోలింగ్ రోజు 12 రకాల గుర్తింపు కార్డులు చూపించవచ్చు
►85 సంవత్సరాలు పైబడిన వారు, వికలాంగులకి ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం
►ఇందుకోసం ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
►అభ్యర్ధుల తమపై ఉన్న క్రిమినల్ కేసులను పేపర్, టీవీలలో మూడుసార్లు పబ్లిష్ చేయాల్సి ఉంటుంది
►3.82 లక్షలు ఉద్యోగులను ఎన్నికల కోసం‌ వినియోగిస్తాం
►ఏపీ ఎన్నికలకి 50 మంది జనరల్ అబ్జర్వర్స్ ఉంటారు
►ప్రతీ అసెంబ్లీకి మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఉంటాయి
►అనుమానిత ఖాతాలపై నిఘా
►నాన్ కమర్షియల్ ప్రాంతాలలో ల్యాండ్ అయ్యే హెలీకాప్టర్లని  తనిఖీలు చేపడతాం
►50 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తాం
►నేటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ అమలుల్లో ఉంటుంది.
►బహిరంగ ప్రదేశాలలో 48 గంటలలోపు పోస్టర్లు, బ్యానర్లు  తొలగించాలి
►ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి వచ్చే 24 గంటలలోపు అన్ని ఫొటోలు తీసేయాల్సి ఉంటుంది
►కొత్త పనులకు పర్మిషన్ లేదు.. జరుగుతున్న పనులకు ఇబ్బంది లేదు
►మంత్రులు సమీక్షలు చేయకూడదు
►మంత్రులకు ప్రోటోకాల్ ఉండదు
►కొత్తగా లబ్దిదారులను ఎంపిక చేయడానికి లేదు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)