Breaking News

టీడీపీతో పొత్తు.. బీజేపీలో రచ్చ.. ‘వినోద్ ధావడే’ ఉక్కిరిబిక్కిరి

Published on Fri, 03/15/2024 - 15:35

సాక్షి, విజయవాడ: విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అలజడి రేగింది. టీడీపీతో పొత్తులపై జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడేని కార్యకర్తలు నిలదీశారు. ప్రధాని మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలకు క్షమాపణలు చెప్పకుండా ఎలా పొత్తులు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ప్రధానికి చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనన్న‌ కార్యకర్తలు.. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎలా సీట్లు ఇస్తారంటూ ప్రశ్నలు గుప్పించారు.

బీజేపీకోసం పనిచేసే వారికే టిక్కెట్లు ఇవ్వాలన్న కార్యకర్తలు.. బీజేపీకి కేటాయించిన సీట్లలో చంద్రబాబు పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల ప్రశ్నలకు వినోద్ ధావడే ఉక్కిరిబిక్కిరి అయారు. ప్రధాని మోదీ చిలకలూరిపేట సభని‌ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వినోద్ ధావడే.. రేపు జాతీయ అధ్యక్షుడు నడ్డాని కలుస్తానని, అధిష్టానం దృష్టికి కార్యకర్తల‌ మనోభావాలను తీసుకెళ్తానన్నారు.

కాగా, ఏపీ బీజేపీలో టికెట్ల పంచాయితీ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. రాష్ట్రంలో పొత్తులపై స్థానిక బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పురందేశ్వరి తీరుపై ఫైరవుతున్నారు. ఇదే సమయంలో పలువురు సీనియర్‌ నేతలు హైకమాండ్‌కు లేఖ రాయడం కలకలం సృష్టించింది. 

మోదీ పర్యటన వేళ ఏపీ బీజేపీలో కలకలం
ప్రధాని మోదీ పర్యటన వేళ ఏపీ బీజేపీలో కలకలం రేగుతోంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డాకి రాసిన లేఖని సీనియర్లు వ్యూహాత్మకంగా లీక్ చేశారు. ఓడే సీట్లనే బీజేపీకి టీడీపీ కేటాయిస్తోందని సీనియర్లు లేఖలో పేర్కొన్నారు. ఆ సీట్లలో టీడీపీ గతంలో గెలవలేదని లేఖలో  ప్రస్తావించారు. టీడీపీ నేతలను బీజేపీలోకి పంపి టిక్కెట్లు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సీనియర్లు.. బీజేపీ ముసుగులో టీడీపీ నేతలు తెరపైకి వస్తున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే టిక్కెట్లు కేటాయించాలంటున్న సీనియర్లు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించకపోతే పార్టీకే నష్టమంటున్నారు.

ఇదీ చదవండి: ఏపీ బీజేపీలో కొత్త ట్విస్ట్‌.. చిచ్చుపెట్టిన చంద్రబాబు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)