Breaking News

ఏపీ బీజేపీలో బిగ్‌ ట్విస్ట్‌.. ఇన్‌ఛార్జ్‌గా తెలంగాణ కీలక నేత?

Published on Sat, 08/12/2023 - 21:07

బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్‌ తనను బాధ్యతలనుంచి తొలగించమని కోరుతున్నారా?. ఐదేళ్ళుగా ఇన్‌చార్జ్‌ పదవిలో కొనసాగుతున్న ఆ కేంద్ర మంత్రి ఏపీకి రావడం తగ్గించేశారు ఎందుకని?. ఆయన పనితీరు మెచ్చి కేంద్రం ఇచ్చిన అదనపు బాధ్యతను బరువుగా ఎందుకు భావిస్తున్నారు?. ప్రస్తుత ఇన్‌చార్జ్‌ని తప్పిస్తే.. కొత్త ఇన్‌చార్జ్‌గా ఎవరు రాబోతున్నారు?..

కేరళకు చెందిన కేంద్ర మంత్రి మురళీధరన్ 2018 నుంచి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉంటూనే ఇన్‌ఛార్జ్‌గా చురుగ్గానే వ్యవహరించేవారు. అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ, ఆ తర్వాత సోము వీర్రాజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నపుడు వారితో కలిసి పనిచేశారు. ఇపుడు పురంధేశ్వరి అధ్యక్షురాలిగా ఉన్నారు. 

ఏపీ ఇన్‌ఛార్జ్‌గా రెండేళ్లపాటు చురుగ్గానే వ్యవహరించిన కేంద్ర మంత్రి మురళీధరన్ ఆ తర్వాత ఏపీ రావడం తగ్గిస్తూ వచ్చారు. మొదట్లో నెలకొకసారి వచ్చిన మురళీధరన్ ఇపుడు మూడు నెలలకొకసారి కూడా ఏపీకి రావడంలేదు. కాగా ఏడాదిన్నరగా ఏపీ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించమని పార్టీ హైకమాండ్‌ను మురళీధరన్ కోరుతున్నారట. ఏపీ బీజేపీలో వెన్నుపోటు రాజకీయాలు భరించలేకే ఆయన ఇన్‌ఛార్జ్‌ పదవి నుంచి తప్పించమని కోరుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

చంద్రబాబే కారణమా?..
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక.. తమ అవసరాల కోసం చంద్రబాబు సూచనల మేరకు బీజేపీలో చేరిన‌ టీడీపీ కోవర్డు గ్యాంగ్ వల్లే మురళీధరన్ ఏపీకి రావడం తగ్గించేశారని టాక్ నడుస్తోంది. ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందో మురళీధరన్ కంటే పచ్చ బ్యాచ్‌కే ముందుగా తెలుస్తోందట. అటు కేంద్రంలోని పెద్దలతో సన్నిహితంగా ఉంటూ, ఇటు ఎల్లో మీడియాకి లీకులిస్తూ ఎప్పటికపుడు తమ‌ పాత బాసుకి అన్ని విషయాలు చేరవేస్తుండటం‌ మురళీధరన్‌కి చాలా ఇబ్బందిగా మారిందట. 

దీనిపై ఢిల్లీలోని పెద్దలతో మాట్లాడిన మురళీధరన్ ఏపీ పార్టీలోని వెన్నుపోటు రాజకీయాలని కంట్రోల్ చేయాలని సూచించారట. అదే సమయంలో తనను ఏపీ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా అధిష్టానాన్ని‌ కోరారట. అయితే, బీజేపీ కేంద్ర నాయకత్వం ఇవేమీ పట్టించుకోకపోవడం.. రాష్ట్ర పార్టీలో పచ్చ బ్యాచ్ హవా పెరుగుతుండటంతో ఇక మురళీధరన్ రాష్ట్రానికి రావడమే తగ్గించేశారని తెలుస్తోంది.

తెర మీదకు బండి సంజయ్‌..
ఎన్నికలకు ఇంకా నెలల సమయం‌ మాత్రమే మిగిలి ఉండటంతో పలు రాష్ట్రాల్లో ఇన్‌ఛార్జ్‌లను సహ ఇన్‌ఛార్జ్‌లని కూడా మార్చడానికి బీజేపీ అధిష్టానం‌ కసరత్తులు చేస్తోంది. ఏపీలో పార్టీ అధ్యక్షుడిని ఎలాగూ మార్చారు గనుక ఎన్నికల ముందు కొత్త టీంకి అవకాశమిచ్చి తనని తప్పించాలని మురళీధరన్‌ కోరుతున్నారట. అదే సమయంలో ఎల్లో బ్యాచ్ ఆట కట్టించడానికి.. లీకు వీరుల పని పట్టడా‌నికి... కొత్త టీంని పరుగులు పెట్టించడానికి ఏపీ ఇన్‌ఛార్జ్‌గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బండి సంజయ్ పేరు పరిశీలనలో ఉందంటున్నారు. 

ఇటీవలే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా దక్కించుకున్న బండి సంజయ్ ఏపీ ఇన్‌ఛార్జ్‌ రేసులో ఉన్నారంటున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకం‌ కావడంతో బండి సంజయ్‌ని తెలంగాణ ఎన్నికలు ముగిసే వరకు అక్కడ నుంచి కదపక పోవచ్చునని మరో టాక్. మరి ఏపీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్న మురళీధరన్ ఆశలు నెరవేరుతాయా?.. బీజేపీ అధిష్టానం‌ ఒప్పుకుంటుందా? కొత్త ఇన్‌చార్జ్‌ని నియమిస్తుందా లేదా అన్నది చూడాలి.

ఇది కూడా చదవండి: ఏపీలో నీకు కనీసం ఇల్లు కూడా లేదు.. కోర్టు కంటే గొప్పోడివా?: రోజా ఫైర్‌

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)