Breaking News

30న సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన!

Published on Mon, 08/28/2023 - 01:16

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థులతో ఈ నెల 30వ తేదీన మొదటి జాబితా విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు పొత్తులకు సంబంధించిన అంశంపై చర్చించేందుకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదివారం సమావేశమైంది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల తరఫున చెరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది.

ఈ మేరకు 30న సీపీఐ, సీపీఎం సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశ ముంది. వామపక్షాలతో పొత్తు ఉండబోదని బీఆర్‌ఎస్‌ పార్టీ తేల్చిచెప్పడంతో ఈ రెండుపార్టీలు ఈ నిర్ణయానికి వచ్చాయి. కాగా, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో సీపీఐ నేతలు ఆదివారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఠాక్రే సీపీఎంతో కూడా సోమవారం సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే సరే సరే, లేకుంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీల తరఫున రెండో జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

ఎవరితో పొత్తు లేకపోతే రెండు పార్టీలు కలిసి దాదాపు 20 నుంచి 24 మధ్య అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా, సీపీఎం రాష్ట్ర కమిటీలో బీఆర్‌ఎస్‌ తీరుపై వాడీవేడి చర్చ జరిగినట్లు తెలుస్తుంది. బీఆర్‌ఎస్‌తో పార్టీ వ్యవహరించినతీరుపై కూడా కొందరు నాయకులు విమర్శించినట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ తీరును ముందే ఎందుకు అర్థం చేసుకోలేకపోయామని నిలదీసినట్టు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో ప్రజాతంత్ర లౌకిక పార్టీలతో ముందుకు సాగాలని పార్టీ నిర్ణయించింది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)