Breaking News

'చర్చకు సిద్ధమే..' మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలకు అమిత్ షా కౌంటర్‌..

Published on Mon, 07/24/2023 - 17:08

ఢిల్లీ: మణిపూర్‌లో అమానవీయ ఘటనపై పార్లమెంట్ దద్దరిల్లింది. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై తక్షణమే చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ సమావేశాలు గురువారం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు సరైన చర్చ జరిగింది లేదు. ప్రతిపక్షాల ఆందోళనలతో సభ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమమని చెప్పారు. ఈ సున్నితమైన అంశం గురించి దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.   

మణిపూర్ అంశంపై చర‍్చకు సహకరించాలని  హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలను కోరారు. మణిపూర్ అంశంపై నిజం తెలియాల‍్సిన అవసరం ఉందని అన్నారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మణిపూర్ అంశంపై మూడు సార్లు సమావేశం వాయిదా పడింది. ఈ రోజు మధ్యాహ్నం 2.30కు సమావేశం ప్రారంభం కాగానే హోం మంత్రి చర్చకు సిద్ధమని తెలిపారు. అయినప్పటికీ అమిత్ షా ప్రసంగానికి అడ్డుపడిన ప్రతిపక్షాలు గందరగోళం చేశారు. దీంతో స్పీకర్ హోం బిర్లా మరోసారి సభను వాయిదా వేయాల్సి వచ్చింది. 

కొన్నిరోజులుగా అల్లర్లతో రగులుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగింపు చేసిన ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. అల్లర్లలో ఇప్పటికే 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు తెగల మధ్య జరుగుతున్న అల్లర్లపై పార్లమెంట్‌లో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.

అయితే.. రూల్ నెంబర్ 267 ప్రకారం చర్చ జరపాలని ప్రతిపక్షాలు కోరగా.. కేంద్రం మాత్రం 176 కింద చర్చిద్దామని స్పష్టం చేసింది. దీని ప్రకారం 267 కింద ప్రత్యేకంగా సుధీర్ఘమైన చర్చలు జరగాల్సి ఉంటుంది. 176 కింద అయితే.. తక్కువ కాల వ్యవధిలో చర్చను ముగిస్తారు. 

ఇదీ చదవండి: మణిపూర్ అల్లర్లు: కూతురి ఆచూకీ కోసం ఎదురుచూపులు.. ఆసుపత్రికి ఫోన్ చేస్తే..  


 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు