Breaking News

అమేథీ, రాయ్‌బరేలీపై కాంగ్రెస్‌ వీడని మౌనం!

Published on Thu, 04/04/2024 - 08:37

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీలలో కాంగ్రెస్‌ ఇంకా లోక్‌సభ అభ్యర్థులను నిలబెట్టలేదు. ఈ రెండు స్థానాల్లో గాంధీ కుటుంబం పోటీ చేస్తుందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది. ఈ రెండు లోకసభ నియోజకవర్గాలపై కాంగ్రెస్‌ ఇంకా మౌనం వీడలేదు. 

పార్టీ అధిష్టానం తాజాగా యూపీ అభ్యర్థుల నూతన జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో అమేథీ, రాయ్‌బరేలీ పేర్లు కనిపించలేదు. కాంగ్రెస్ తన కంచుకోట స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  

అమేథీ, రాయ్‌బరేలీకి చెందిన కాంగ్రెస్‌ నేతలు గాంధీ కుటుంబ సభ్యులను ఇక్కడి నుంచి పోటీచేయించేందుకు ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. ఇందుకోసం వారు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి లేఖలు పంపుతున్నారని సమాచారం. అయితే నామినేషన్ల చివరి రోజున ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని పలువురు భావిస్తున్నారు. రాయ్‌బరేలీ సీటును గాంధీ కుటుంబం నుంచి వేరొకరికి వెళ్లేందుకు అనుమతించబోమని స్థానిక కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈ రెండు స్థానాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు మహిళా నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. వీరిలో ఒకరు జాతీయ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండగా, మరొకరు రాష్ట్ర పార్టీలో కీలక పదవిలో ఉన్నారట. 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు