Breaking News

‘అల్లు అర్జున్‌ను ఆరోజు ఎందుకు అడ్డుకోలేదు?’

Published on Tue, 12/24/2024 - 17:21

హైదరాబాద్‌, సాక్షి:  సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటన కేసులో నటుడు అల్లు అర్జున్‌(Allu Arjun) విచారణ వేళ.. మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం అల్లు అర్జున్‌ను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారాయన. సాక్షితో ఆయన మాట్లాడుతూ..

‘‘రేవతి కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉంది. పేదలైనా.. పెద్దలైనా వారికి మేం అండగా ఉంటాం. అల్లు అర్జున్‌ విషయంలో కాంగ్రెస్‌ చేసేది ముమ్మాటికీ రాజకీయమే. అసెంబ్లీలో తన దోస్తుతో(ఎంఐఎం అక్బరుద్దీన్‌ను ఉద్దేశించి..) ప్రశ్న అడిగించుకోని కాంగ్రెస్ రాజకీయం చేసింది. అలాంటప్పుడు.. మొదటి రోజే ఎందుకు కాంగ్రెస్ (Congress party) నేతలు రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదు?..

ముమ్మాటికీ పోలీసుల వైఫల్యం కారణంగానే ఘటన జరిగింది. అసలు అనుమతి లేదన్నప్పుడు అల్లు అర్జున్ ను ఇంటి నుంచి ఎందుకు బయటకు రానిచ్చారు. ఇంటి వద్దే ఆయన్ని బారికేడ్లు వేసి ఎందుకు అడ్డుకోలేదు?. థియేటర్ వద్ద యూనిఫాం లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా!. సంధ్య థియేటర్ గేట్లు మూసివేసి హీరో వెహికిల్ ను టోయింగ్ ఎందుకు చేయలేదు?. కేవలం అల్లు అర్జున్‌ అరెస్ట్‌తో వచ్చిన బద్నాంను తప్పించుకునేందుకే ఇంతా చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌ కక్ష గట్టి సాధిస్తోంది ’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే బీజేపీ అల్లు అర్జున్‌కు అండగా ఉంటుందని ఆ పార్టీ కీలక నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) ఇంతకు ముందే ప్రకటించారు. 

అంబేద్కర్ ఇష్యూపై..
కాంగ్రెస్ కు అంబేద్కర్ పేరును తీసే అర్హత లేదని రఘునందన్‌ చెబుతున్నారు. ‘‘తెలంగాణలో 125 అడుగుల విగ్రహానికి కనీసం దండ వేయలేదు రేవంత్ ప్రభుత్వం.  అంతపెద్ద విగ్రహానికి గేటుకు తాళం వేసిన రోజే కాంగ్రెస్ చెంపలు వేసుకొని క్షమాపణలు చెప్పాలి.  రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కు కనీసం భారతరత్న ఇవ్వలేదు కాంగ్రెస్. అంబేద్కర్ ను అన్ని రకాలుగా కాంగ్రెస్సే అవమానించింది. హాస్టళ్లలో ఫుడ్ తిని విద్యార్థులు చనిపోతున్నారు. దాన్ని డైవర్ట్ చేసేందుకు సీఎం సైతం ఆందోళనల్లో పాల్గొంటున్నారు అని రఘునందన్‌ మండిపడ్డారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)