Breaking News

సీఎం రేవంత్‌ మతి లేకుండా మాట్లాడుతున్నారు

Published on Fri, 04/11/2025 - 06:15

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి మతి స్థిమితం లేకుండా, బాధ్యతారహి తంగా మాట్లాడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం తన కుర్చీని కాపాడుకోవడం కోసం రాహుల్‌ గాంధీని మెప్పించడానికి ప్రధాని మోదీని, బీజేపీని టార్గెట్‌ చేశారన్నారు. తెలంగాణను రాహుల్‌ పాదాల వద్ద రేవంత్‌ తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రేవంత్‌ చెబుతున్నట్టుగా తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వడం కాదని.., హామీలు అమలు చేయనందుకు ప్రజలే రాహుల్‌ని ఇక్కడ అడుగుపెట్టనివ్వరని వ్యాఖ్యానించారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్‌లో మళ్లీ పోటీ చేస్తే రేవంత్‌ గెలిచే పరిస్థితి లేదని, అక్కడ ఆయన రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో కొడంగల్‌లో అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్‌కు 23 వేల ఓట్లు తగ్గాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అక్కడ రేవంత్‌ని ఓడించేది బీజేపీనే. ఉప ఎన్నిక వస్తే అక్కడ ఆయన బీజేపీ చేతిలో ఓడిపోవడం ఖాయం.

సొంత సీటులోనే గెలిచే సత్తా లేని రేవంత్‌.., తెలంగాణ నుంచి బీజేపీని ఖతం చేస్తామనడం బుడ్డర్‌ ఖాన్‌ మాటలే’అని అన్నారు. ‘హామీలు అమలు చేయకుండా అహ్మదాబాద్‌లో గొప్పలు చెప్తావా? గ్యారంటీలపై చర్చకు సిద్ధమా? రాహుల్‌ గాంధీకి తెలంగాణకు వచ్చేందుకు ముఖం లేదు. దమ్ముంటే హెచ్‌సీయూలో రాహుల్‌ గాంధీ మీటింగ్‌ పెట్టగలరా?’అని మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. తన పదవికి కౌంట్‌ డౌన్‌ మొదలైందని భావిస్తున్న రేవంత్‌రెడ్డి, ఎలాగైనా దానిని కాపాడుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే మోదీ, బీజేపీలపై విమర్శలు సంధిస్తున్నారన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)