Breaking News

100% రుణమాఫీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

Published on Sun, 08/18/2024 - 05:03

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు వందశాతం రుణమాఫీ అయినట్లు నిరూ పిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వ ర్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వెళ్లి రైతుల సమక్షంలోనే చర్చ పెట్టి, పూర్తిగా రుణమాఫీ జరిగిందంటే తాను దేనికైనా సిద్ధమేనన్నారు. అందరికీ రుణ మాఫీ జరగలేదని రైతులు చెబితే, రేవంత్‌రెడ్డి రాజ కీయాల నుంచి తప్పుకోవడమో, రాజీనామా చేయడమో.. ఏది చేస్తా రో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

శనివారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్‌లో మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో రేవంత్‌ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందన్నారు. మొత్తం 60 లక్షల మంది అర్హులుండగా.. 22 లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగిందన్నారు. రుణమాఫీకి రూ.49 వేల కోట్లు ఇవ్వాల్సిఉండగా.. కేవలం రూ.17 వేల కోట్లే ఇచ్చారని తెలిపారు. సీఎం, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కు దమ్ముంటే గ్రామాలకు వెళ్లి రైతులకు రుణాలు మాఫీ అయ్యాయో లేదో ఆరా తీయాలన్నారు. దీనిపై రైతుల సమ క్షంలో చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. రుణమాఫీ జరిగిన రైతుల వివరాలను వారంరోజు ల్లోగా ప్రభుత్వం వెల్లడించాలన్నారు.

పెండింగులో ఉన్న రైతుల రుణాలను ఈ నెలా ఖరులోగా మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ నివేదికపై చర్చించి, రైతు భరోసా పథకానికి మార్గదర్శ కాలు ఖరారు చేసేందుకు అసెంబ్లీని సమావేశ పరచాలన్నారు. రైతు భరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి మళ్లించారని ఆరోపించారు.  రైతు భరోసా ఖరీఫ్‌ సీజన్‌ డబ్బులను ఈ నెలాఖరులోగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రుణమాఫీ కాని రైతులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రేవంత్‌ కొత్త విషయాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అని రేవంత్‌ ప్రచారం చేస్తున్నారన్నారు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)