Breaking News

‘ఇందిరమ్మ కమిటీలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలి’

Published on Tue, 01/07/2025 - 13:20

కొడంగల్‌(వికారాబాద్‌ జిల్లా): ప్రధాన మంత్రి అవస్ యోజన కింద ఇల్లు లేని పేదల కోసమ్ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని,. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకుంటుందని విమర్శించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ(DK Aruna). అమృత్‌ 2 పథకం ద్వారా నిధులు కేటాయింపుపై కొడంగల్‌ లో మాట్లాడిన ఆమె..  తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.

నిరుపేదలు ఇళ్లు లేకుండా ఉండకూడదనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి పేరు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. దీనిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని డీకే అరుణ స్పష్టం చేశారు. గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఇలానే చేశారని ఆమె మండిపడ్డారు.

పార్టీలకు అతీతంగా ఇళ్ల కేటాయింపు జరగాలి..

గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేశారని, అందులో కేవలం కాంగ్రెస్‌ పార్టీ వారినే పరిమితం చేయొద్దన్నారు. ఈ కమిటీల్లో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో ఎవరైతే నీడలేని పేద ప్రజలు ఉంటారో అలాంటి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేద ప్రజలు ఉండకూడదని, పార్టీలకు అతీతంగా ఇళ్ల కేటాయింపు జరగాలన్నారు డీకే అరుణ.

జనాభా ఆధారంగానే అమృత్‌ 2 పథకం నిధులు

అమృత్‌ 2 పథకం(amrut 2 scheme) కింద దేశంలోని అన్ని మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు డీకే అరుణ. ఈ పథకం ద్వారా మున్సిపాలిటీలో ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఈ నిధులు వాడుకోవచ్చన్నారు. కొడంగల్‌ మున్సిపాలిటీకి కూడా రూ. 4.50 కోట్లు మంజూర చేయడం జరిగిందని, మున్సిపాలిటీలో ఉన్న జనాభా ఆధారంగా చేసుకొనే నిధులను విడుదల చేయడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. ప్రతి గ్రామం, పంచాయతీ, మున్సిపల్‌ పట్టణాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశమని, అందులో భాగంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌(NREGS) పథకం ద్వారా సీసీ రోడ్డు, రైతు వేదికలు, వైకుంఠధామాలు ఇవ్వడం జరిగిందన్నారు.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)