Breaking News

గ్రామాలకు వచ్చే నిధులన్నీ కేంద్రానివే..

Published on Wed, 02/07/2024 - 04:15

కరీంనగర్‌టౌన్‌/హుజూరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో జరిగే అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వమే నిధులిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు పైసా ఇవ్వడం లేదని, పంచాయతీ సిబ్బందికి జీతాలు, కరెంటు బిల్లులు సహా అన్నింటికీ కేంద్రనిధులనే వాడుకుంటున్నారన్నారు.

‘గావ్‌ చలో అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌ జిల్లా రంగాపూర్‌ గ్రామానికి వచ్చి న బండి.. రాత్రి పొద్దుపోయే వరకూ గ్రామంలో పర్యటించారు. వివిధ వర్గాల ప్రజలను కలిశారు. పార్టీ బూత్‌ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. మహిళలతో ముచ్చటించారు. కాగా, అంతకుముందు ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో విజయం సాధించడమే బీజేపీ లక్ష్యమన్నారు.

‘గావ్‌ చలో అభియాన్‌’లో భాగంగా ప్రతి నేత గ్రామాల్లో పల్లెనిద్ర, నగరాల్లో బస్తీ నిద్ర చేయాలన్నారు. 24 గంటలపాటు ఆ గ్రామంలో, బస్తీలో ఉండి ప్రజలతో, కార్యకర్తలతో మమేకం కావాలని తెలిపారు.  రాజకీయ పారీ్టల నేతల భవిష్యత్తు బాగుండాలంటే వారంతా బీజేపీలో చేరడం ఉత్తమమని అన్నారు.  

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)