Breaking News

‘చరిత్రకెక్కిన మటన్ వార్‌’.. బీజేపీ ఎంపీ విందుపై అఖిలేష్ చురకలు

Published on Mon, 11/18/2024 - 18:15

లక్నో: బీజేపీ ఎంపీ విందుపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌‌ అఖిలేష్‌ యాదవ్‌ విరుచుకుపడ్డారు. బీజేపీ ఎంపీ వినోద్‌ కుమార్‌ ఇటీవల ఇచ్చిన విందులో జరిగిన ‘మటన్ వార్’ చరిత్రకెక్కిందని విమర్శలు గుప్పించారు. ‘మీ నియోజకవర్గంలో  జరిగిన ఎన్నో సంఘటనలు ప్రాచుర్యం పొందాయి. కానీ మటన్‌ వార్‌ కూడా జరిగిందని నాకు తెలియనే లేదు. నేను ఎన్నో యుద్ధాలను చూశాను.. ఈ మటన్‌ యుద్ధం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది’ అంటూ వ్యంగ్యస్థ్రాలు సంధించారు.

అసలేం జరిగిందంటే.. ఉత్తర్‌ప్రదేశ్ మీర్జాపూర్‌లో బదోహి బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ బింద్ ఈ నెల 14వ ఆయన కార్యాలయంలో విందు ఏర్పాటు చేశారు. దీనికి చాలా మంది హాజరయ్యారు. అయితే వారికి భోజనం వడ్డించే సమయంలో ఓ వ్యక్తికి.. ఎంపీ డ్రైవర్ సోదరుడు మటన్ కర్రీ వేశాడు. కానీ అందులో ముక్కలు లేక కేవలం గ్రేవీ మాత్రమే ఉండటంతో సదరు వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ఆ ఎంపీ డ్రైవర్ సోదరుడిని దూషించాడు. 

వారిద్దరి మధ్య గొడవ జరిగింది. మిగితా వారు కూడా వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం పలువురు బీజేపీ సీనియర్‌ నేతలు జోక్యం చేసుకోవడంతో ఆ గొడవ సద్దుమణించింది. ఆ తర్వాత ఈ ఘటనపై బీజేపీ ఎంపీ ఆఫీస్ వ్యవహారాలు చూసుకునే ఉమాశంకర్ బింద్ ఈ ఘటనపై స్పందిస్తూ. విందులో చివర్లో మద్యం చేసించిన వారు రావడం వల్ల గొడవ జరిగినట్లు తెలిపారు.

మరోవైపు మీర్జాపూర్ జిల్లాలోని మజ్‌వాన్ నియోజకవర్గంలో నిషాద్ పార్టీ ఎమ్మెల్యే అయిన వినోద్ కుమార్ బింద్, బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఎంపీగా గెలిచారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని సుచిస్మిత మౌర్యపై, భదోహి ఎంపీ రమేశ్ బింద్ కుమార్తె జ్యోతి బింద్‌ను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) బరిలోకి దింపింది

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)