Breaking News

ఎన్నికల ప్రచారంలో అఖిలేష్‌ కుమార్తె

Published on Tue, 03/19/2024 - 11:25

రాబోయే లోక్‌సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ భార్య, సమాజ్‌వాదీ పార్టీ నేత డింపుల్ యాదవ్ మెయిన్‌పురిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అఖిలేష్‌, డింపుల్‌ల కుమార్తె అదితి యాదవ్  కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మెయిన్‌పురి నుంచి డింపుల్ యాదవ్‌కు సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ టిక్కెట్ కేటాయించింది.

ములాయం సింగ్ యాదవ్ వారసత్వాన్ని కాపాడే బాధ్యత ఇప్పుడు డింపుల్‌ తీసుకున్నారు. ఈ ప్రాంత ప్రజలు ములాయం సింగ్‌ను ‘దాదా’ అని పిలిచేవారు. మెయిన్‌పురి సీటు 1996 నుంచి సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. మెయిన్‌పురిలో డింపుల్ యాదవ్‌తో కలిసి అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్ కనిపించారు.  సమాజ్‌వాదీ పార్టీ డింపుల్ యాదవ్‌కు మెయిన్‌పురి స్థానం నుంచి మరోమారు పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. 

ములాయం సింగ్ మరణానంతరం డింపుల్ ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు డింపుల్ గెలుపు అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు. యూపీలో నూతన రామాలయం ప్రారంభమైన నేపధ్యంలో ఇది సమాజ్‌వాదీ పార్టీ ఓటు బ్యాంకును తగ్గిస్తుందని పలువురు అంటున్నారు. ములాయంను తొలిసారిగా పార్లమెంటుకు పంపిన ఘనత మెయిన్‌పురి ప్రజలకే దక్కుతుంది. అప్పటి నుంచి ఈ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు గెలుస్తూనే ఉన్నారు. తేజ్ ప్రతాప్, ధర్మేంద్ర యాదవ్ కూడా ఈ స్థానం నుంచే పార్లమెంటు సభ్యులయ్యారు.

2011 జనాభా లెక్కల ప్రకారం మెయిన్‌పురి జిల్లాలో 93.48 శాతం హిందూ జనాభా ఉంది. ఇక్కడ యాదవుల ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. 2019లో ఇక్కడ 17.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. యూపీలో ముస్లిం, యాదవ్ వర్గాలను సమాజ్‌వాదీ పార్టీ సంప్రదాయ ఓటర్లుగా పరిగణిస్తారు. ఇక్కడ ముస్లిం ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. యాదవుల ఓటు బ్యాంకుకు తోడు ములాయం సింగ్ ప్రభావం కారణంగా సమాజ్ వాదీ పార్టీ రెండు దశాబ్దాలుగా ఈ స్థానంలో తన హవా చాటుతోంది. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)