Breaking News

Ts: ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి: అక్బరుద్దీన్‌

Published on Fri, 02/16/2024 - 15:21

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం కులగణణ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు.  కుల గణనపై కాంగ్రెస్‌ ఎన్నికల హామీ ఇవ్వలేదని, అయినా సభలో తీర్మానం చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీలపై తొలుత తీర్మానం చేయాలని సూచించారు. కుల గణన కంటే ముందు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ సభలో పెట్టాలని డిమాండ్‌ చేశారు.  సమగ్ర కుటుంబ సర్వే వల్ల ఎవరికి లాభం జరిగిందో చెప్పాలన్నారు.

‘మేం కులగణన తీర్మానానినికి మద్దతు ఇస్తున్నాం. దీనికి సంబంధించి న్యాయమైన అంశాలపై జాగ్రతగా ఉండాలి.  స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాభివృద్ధిలో మైనార్టీల పాత్ర ఉంది.  ముస్లింలు ఇందిరా నుంచి సోనియా గాంధీ వరకు మద్దతు కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్‌ఎస్‌కు సహకరించాం.  బీసీ, దళిత వర్గాల కోసం కొట్లాడితే లీడర్లంటారు.  మేము మా మైనార్టీల కోసం కొట్లాడితే మాత్రం బీజేపీ బి - టీమ్ అంటున్నారు’ అని ఒవైసీ మండిపడ్డారు. 

తెలంగాణ అసెంబ్లీ పనితీరుపై ఈ సందర్భంగా అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బిజినెస్‌ ఏముంటుందో ముందుగా తెలియడం లేదన్నారు. 13వ తేదీ వరకు మాత్రమే బీఏసీ సమావేశాల్లో చర్చించారని,   తర్వాత అసెంబ్లీలో ఏం జరుగుతుందో  సమాచారం లేదని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్‌ 

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్