Breaking News

వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో?

Published on Sat, 03/09/2024 - 11:51

త‍్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సొంత కుటుంబ సభ్యులే ప్రత్యర్ధులుగా మారి కయ్యానికి కాలుదువ్వనున్నారు. ముఖాముఖీ తలపడనున్నారు. గత 55 సంవత్సరాలుగా కుటుంబం హవా కొనసాగుతుండగా..రాజకీయ వైరంతో కుటుంబ సభ్యులే ఒకరిపై ఒకరు పోటీ పడనున్నారు. మరి ఈ ఎన్నికల పోరులో ప్రత్యర్ధులైన వదినా, మరదళ్లలో గెలుపెవరిదో

ఎన్సీపీని చీల్చి బీజేపీ ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన అజిత్‌ పవర్‌..తన భార్యను రాజకీయ అరంగ్రేటం చేయిస్తున్నారు. అందులోనూ దిగ్గజ నేత, తన బాబాయ్‌ ఎన్సీపీ అధినేత శరద్‌పవర్‌ కుమార్తె, సిట్టింగ్‌ ఎంపీ సుప్రీయా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి నుంచే బరిలో దింపుతున్నారు? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. 

మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్‌పవార్‌ వర్గం)ల మధ్య లోక్‌సభ సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్సీపీ-అజిత్‌ పవర్‌ వర్గ కార్యకర్తలు బలమైన నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని అభిప్రాయపడ్డారు అని పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ సునీల్ తట్కరే అన్నారు. బారామతిలో అధికార కూటమి నుంచి పోటీ చేసేందుకు ఎన్సీపీ సిద్ధంగా ఉంది. కూటమి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత సునేత్ర పవార్ బారామతి నుండి పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని అన్నారు.  

2009 నుంచి ప్రస్తుతం బారామతి లోక్‌సభ నుంచి గెలుస్తూ వస్తున్న శరద్‌ పవర్‌ కుమార్తె సుప్రీయా సూలే ప్రత్యర్ధిగా సునేత్ర పవార్‌ అవుతారు. పెదనాన్న కొడుకైన అజిత్‌.. సుప్రియాకు అన్నయ్య అవుతారు. ఆ లెక్కనా వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో చూడాలి మరి! 

బాబాయితో మనస్పర్థలు ఎందుకు? 
అజిత్ పవార్‌ తండ్రి అనంతరావు పవార్​. ఈయన ప్రముఖ సినీ దర్శకుడు శాంతారారం వద్ద పని చేశారు. అయినా.. అజిత్​ సినిమా రంగంవైపు మళ్లలేదు. రాజకీయాల్లో ఉన్న బాబాయ్‌ శరద్‌ పవార్‌ మార్గాన్ని ఎంచుకున్నారు. తన సొంత పట్టణమైన బారామతి నుంచి తొలిసారిగా 1991లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.అప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగతూ వచ్చారు. కానీ శరద్‌ పవర్‌ కుమార్తె సుప్రియా సూలే రాకతో అజిత్‌ పవర్‌ రాజకీయం మొత్తం మారిపోయింది.

అంతా తానై 
శరద్‌ పవార్‌కు మగపిల్లలు లేరు. ఏకైక కుమార్తె సుప్రియా సూలే వివాహం చేసుకొని సింగపూర్‌లో స్థిరపడ్డారు. 2009 నుంచి బారామతి స్థానం లోక్‌సభ స్థానం నుంచి ఆమె ఎంపీగా గెలిచినా..ఢిల్లీకే పరిమితమయ్యారు. ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి రారని శరద్‌ పవార్​ పలు సందర్భాల్లో చెప్పారు. దాంతో శరద్‌ రాజకీయ వారసుడు అజిత్‌ అని అందరూ భావించారు. పార్టీలోనూ ఆయనకు గౌరవం కూడా లభించింది.

బాబాయ్‌పై తిరుగుబాటు
అయితే, 2019లో జరిగిన వరుస పరిణామాలతో బాబాయి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌పై అజిత్‌ పవార్‌ తిరుగుబాటు ప్రకటించారు. నాటి ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలో బీజేపీకి మద్దతు పలికి డిప్యూటీ సీఎం అయ్యారు. కాగా, త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రీయా సూలేను ఓడించాలనే ఉద్దేశంతో తన భార్య సునేత్రతో పోటీ చేయించేందుకు సిద్ధమయ్యారు అజిత్‌ పవర్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)