Breaking News

అజిత్‌ పవార్‌కు ఎదురు దెబ్బ.. శరద్‌ పవార్‌కు టచ్‌లోకి 15 మంది ఎమ్మెల్యేలు!

Published on Wed, 07/17/2024 - 10:14

ముంబై : అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అజిత్‌ పవార్‌ వర్గంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)‌ 20 మంది నేతలు (అందులో 15మంది ఎమ్మెల్యేలు).. శరద్‌ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారా?‌ అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు.  

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)కి నేతృత్వం వహిస్తున్న అజిత్‌ పవార్‌కు గట్టి షాక్‌ తగిలింది. అజిత్‌ పవార్‌కు నేతృత్వంలోని ఎన్సీపీకి నలుగురు కీలక నేతలు రాజీనామా చేశారు. త్వరలోనే శరద్‌ పవార్‌తో జతకట్టనున్నారు.

పింప్రి చించ్వాడ్‌ ఎన్సీపీ యూనిట్‌ అధ్యక్షుడు అజిత్ గవానే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను అజిత్‌ పవార్‌కు పంపించారు. గవానేతో పాటు స్టూడెండ్‌ వింగ్‌ అధ్యక్షుడు యష్ సానే,మాజీ కార్పొరేటర్లు రాహుల్ భోసలే,పంకజ్ భలేకర్ ఎన్సీపీకి గుడ్‌బై చెప్పారు.

అజిత్‌ పవార్‌ వర్గంలో అలజడి
పింప్రి చించ్వాడ్‌కు చెందిన నలుగురు కీలక నేతలు రాజీనామా చేయడంతో అజిత్‌ పవార్‌ వర్గంలో అలజడి మొదలైంది. మరికొందరు నేతలు సైతం అజిత్‌ను కాదని శరద్‌ పవార్‌తో టచ్‌లోకి వెళ్లారంటూ మహరాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. 

 

శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు 
అందుకు ఊతం ఇచ్చేలా శరద్ పవార్ గత నెలలో ‘తన పార్టీ నాశనాన్ని కోరుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వారిని ఆహ్వానించం. కానీ పార్టీ పరువును దెబ్బతీయకుండా బలోపేతం చేసేందుకు కృషి చేసే నాయకుల్ని తిరిగి చేర్చుకుంటాం’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో పింప్రి చించ్వాడ్‌ అజిత్‌ పవార్‌ వర్గంలోని ఎన్సీపీ నేతలు తన రాజీనామాలు చేయడం మహా రాజకీయాలు మరోసారి చర్చకు దారి తీశాయి.

అజిత్ పవార్ NCPకి షాక్

షాక్‌లోకి అజిత్‌ పవార్‌ వర్గం
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహరాష్ట్ర అజిత్‌ పవార్‌ వర్గం 4 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. ఈ ఊహించని ఫలితాలు తనని షాక్‌కి గురి చేశాయని, ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అజిత్‌ పవార్‌ వ్యాఖ్యానించారు.



త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు
కాగా, ఈ ఏడాది నవంబర్‌లో మహరాష్ట్రలో 288 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో ఉద్దవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేన 115 నుంచి 125 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుండగా.. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ సైతం మెజార్టీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుండగా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలో డీలా పడ్డ అజిత్‌ పవార్‌ వర్గంలోని 15 మంది ఎమ్మెల్యేలు శరద్‌ పవార్‌కు టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం.

శరద్‌ పవార్‌ వర్సెస్‌ అజిత్‌ పవార్‌
గతేడాది మహారాష్ట్ర రాజకీయాల్లో అ‍త్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ ఉద్ధండుడు శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నిట్టనిలువునా చీలింది. పార్టీ సీనియర్‌ నేత, పవార్‌కు స్వయానా అన్న కుమారుడైన అజిత్‌ పవారే పార్టీని చీల్చారు. ఎన్సీపీలో తనకు, తనకుమారుడు పార్థ్‌కు రాజకీయ భవిష్యత్‌ ఉండదనే ఆందోళనతో పార్టీని చీల్చి శరద్‌ పవార్‌ వర్గంలో నేతల్ని తనవైపుకు తిప్పుకున్నారు. వెంటనే ప్రభుత్వంలో చేరారు. వారిలో కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టారు. మహరాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ బాధ్యతలు చేపట్టారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)