Breaking News

ఎన్నికల బరిలో బిగ్‌ బాస్‌ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?‌

Published on Wed, 05/08/2024 - 08:53

మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికలు ఈసారి మరింత ఆసక్తికరంగా మారాయి. హిందీ బిగ్‌ బాస్‌ ఫేమ్‌, నటుడు అజాజ్ ఖాన్ ముంబైలోని నార్త్ సెంట్రల్ సీటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్నాక అజాజ్ ఖాన్ జనంలో మరింత ఆదరణ సంపాదించారు. ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఈ ఖాన్  ఉవ్విళ్లూరుతున్నారు.

అజాజ్ ఖాన్ తాను ముంబైలోని నార్త్ సెంట్రల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగానని, తన ఎన్నికల గుర్తు డంబెల్‌ అని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. వ్యవస్థ మారాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన పేర్కొన్నారు. అజాజ్ ఖాన్ బీజేపీ అభ్యర్థి ఉజ్వల్ నికమ్, కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్‌లపై పోటీకి దిగారు.

తన సోషల్‌ మీడియా ఖాతాలో అజాజ్ ఖాన్ ‘వ్యవస్థలో మార్పు తీసుకురావాలనుకుంటే, అవినీతిపరులపై పోరాడాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలి. ప్రజలు నన్ను బిగ్ బాస్‌ షోలో చూసి ఎంతగానో ఇష్టపడ్డారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సమాజానికి ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకనే ఎన్నికల బరిలోకి దిగాను.

అయితే ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ నాకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి.  అయితే నేను పోరాడటానికి, ప్రజలకు మంచి చేయడానికే ఎన్నికల బరిలోకి దిగాను. నేను వ్యవస్థలో కీలకంగా ఉంటే ఏదైనా చేయగలుగుతాను. నేను ఒక యువ నాయకునిగా ఎదగాలనుకుంటున్నాను. మనకు దేవాలయాలు, మసీదుల కంటే పాఠశాల అవసరం ఎక్కువగా ఉంది.

నేను భగవద్గీగీతను చదవని హిందువులను, ఖురాన్ చదవని ముస్లింలను చాలా మందిని చూశాను. దీంతో వాస్తవానికి మతం అంటే ఏమిటో చాలామందికి తెలియదని అర్థం చేసుకున్నాను. ఎవరైనా ఈ గ్రంథాలను చదివినప్పుడు మతం అంటే ఏమిటో అర్థం చేసు​కోగలుగుతారు. దేశంలో మత రాజకీయాలు చేయకూడదు. ఐక్యతతో కూడిన రాజకీయాలు అవసరం’ అని అజాజ్ ఖాన్‌ పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)