Breaking News

చంద్రబాబు,నితీశ్‌ వల్లే వక్ఫ్‌ చట్టం: అసదుద్దీన్‌ ఒవైసీ

Published on Mon, 04/14/2025 - 05:06

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ సంపూర్ణ సహకారంతోనే ప్రధాని నరేంద్రమోదీ వక్ఫ్‌ నల్ల చట్టాన్ని తీసుకురాగలిగారని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని దారుస్సలాంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

టీటీడీ బోర్డులో హిందువులను మాత్రమే సభ్యులుగా కొనసాగిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. వక్ఫ్‌ బోర్డులో ఇతర మతస్తులను సభ్యులుగా చేర్చే బిల్లుకు ఏ విధంగా మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు మద్దతిచ్చి.. తన కుమారుడు లోకేశ్‌ రాజకీయ భవితవ్యాన్ని దెబ్బతీశారని అన్నారు. భవిష్యత్‌లో ముస్లింలు చంద్రబాబు వారసులను ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు.  

వక్ఫ్‌ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే.. 
వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15, 25, 26, 29లలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని అసదుద్దీన్‌ అన్నారు. మోదీ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా ముస్లింల హక్కులన్నింటినీ లాక్కుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ సర్కారు దేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. 

వక్ఫ్‌పై బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. హిందు, జైన, సిక్కు ఎండోమెంట్‌ బోర్డులలో ఆ మత విశ్వాసాలను అనుసరించే వారు మాత్రమే సభ్యులుగా ఉంటారని, అలాంటప్పుడు వక్ఫ్‌ బోర్డులో ముస్లిమేతరులు సభ్యులుగా ఉండటం సబబా? అని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకొని వక్స్‌ భూములను ఆక్రమించిన వారికే వాటిని కట్టబెట్టే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు.  



సవరణకు వ్యతిరేకంగా సభ 
వక్ఫ్‌ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 19న దారుస్సలాంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అసదుద్దీన్‌ ప్రకటించారు. వక్ఫ్‌ బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్‌ సైఫుల్లా రెహా్మనీ అధ్యక్షత జరిగే ఈ సభకు దేశవ్యాప్తంగా మత పెద్దలు, పలువురు రాజకీయ నేతలు హాజరవుతారని చెప్పారు. వక్ఫ్‌ చట్ట వ్యతిరేక నిరసనలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.    

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)