Breaking News

అన్నామలైకి వ్యతిరేకంగా అన్నాడీఎంకే తీర్మానం

Published on Tue, 06/13/2023 - 15:05

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే మాజీ చీఫ్‌ దివంగత జయలలితను ఉద్దేశించి పరోక్షంగా ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ అన్నామలై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అమ్మను తెరపైకి తెచ్చి అవినీతి విమర్శ చేశాడంటూ అన్నామలైపై ఏఐఏడీఎంకే కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో మిత్రధర్మాన్ని బీజేపీ పాతరేస్తోందని మండిపడుతోంది. అదే టైంలో పొత్తు తెగిపోతోందనే ఊహాగానాల నడుమ ఇవాళ(మంగళవారం) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.  

బీజేపీ అన్నామలైకి వ్యతిరేకంగా అన్నాడీఎకేం ఓ తీర్మానం చేసి.. ఆమోదించింది. అన్నామలై చేసిన వ్యాఖ్యలు అనుభవలేమి, బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవంటూ ఆ తీర్మానంలో పేర్కొంది పార్టీ. గత కొంతకాలంగా మిత్రపక్షంతో అన్నామలై తీరు సరిగా ఉండడం లేదని, తన వ్యాఖ్యలకు గానూ ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో మిత్రపక్షం(బీజేపీ) దృష్టిసారించాల్సిన అవసరం ఉందంటూ అందులో పేర్కొంది. 

వాస్తవానికి ఇవాళ జరిగిన ఏఐఏడీఎంకే జిల్లా కార్యదర్శలు సమావేశమే. కొత్త సభ్యత్వం నమోదు గురించి చర్చించాల్సి ఉంది. అయితే అన్నామలై వ్యాఖ్యలు మంట పుట్టించిన నేపథ్యంలో అనూహ్యంగా ఇలా ఆయనకు వ్యతిరేక తీర్మానం ఆమోదించింది పార్టీ. 

ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై.. జయలలితపై నమోదు అయిన అక్రమాస్తుల కేసు గురించి పరోక్షంగా ప్రస్తావించాడు. ‘‘ఈ రాష్ట్రంలో(తమిళనాడు) అవినీతి పేరుకుపోయి ఉంది. మాజీ ముఖ్యమంత్రులు సైతం అవినీతి కేసుల్లో దోషులుగా తేలారు. ఈ కారణం వల్లే తమిళనాడు ఇవాళ దేశంలోనే అవినీతి రాష్ట్రాల జాబితాలో నిలిచింది. అలాంటి ప్రభుత్వాలను బీజేపీ నిలదీసి తీరుతుంది’’ అంటూ వ్యాఖ్యానించారాయన.

దీంతో ఏఐఏడీఎంకే క్యాడర్‌ నొచ్చుకుంది. 1998లో బీజేపీ అధికారంలోకి రావడానికి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే సాయం చేసిన విషయాన్ని మరిచిపోయి ఉంటుందంటూ అన్నామలైకు చరకలు అంటించారు పలువురు నేతలు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై అన్నామలై వెనక్కి తీసుకోకపోతే.. పొత్తు తెంచుకునే విషయంపై ఆలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది పార్టీ. ఇక ఇవాళ ఏకంగా అన్నామలైకి వ్యతిరేకంగా తీర్మానం చేయడం గమనార్హం. 

ఇక బీజేపీ కూడా ఈ విషయంలో తగ్గడం లేదు. అన్నామలై వ్యాఖ్యలను అన్నాడీఎంకే తప్పుగా అర్థం చేసుకుందని అంటోంది. మరోవైపు తీవ్ర వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే నేత డీ జయకుమార్‌పై బీజేపీ మండిపడింది. 

అన్నామలై అసలు ఓ పార్టీ చీఫ్‌గా ఉండేందుకు అర్హుడే కాదు. ఆయన మాటలు జారవిడిచి ఉండాల్సింది కాదు. ఆయన తీరు చూస్తుంటే మాతో పొత్తు కొనసాగించేందుకు ఆసక్తితో లేనట్లు కనిపిస్తోంది. లేదంటే.. మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని అనుకోవట్లేదమో అంటూ జయకుమార్‌ మండిపడ్డారు.

ఇక అక్రమాస్తుల కేసులో A1 నిందితురాలుగా జయలలితే ఉన్నారు. అయితే తీర్పు వెలువడడానికి కంటే ముందే జయలలిత కన్నుమూశారు. ఈ కేసులో ఆమె నిచ్చెలి శశికళ, మరొకందరికి జైలు శిక్ష పడింది. 

జయలలిత అక్రమాస్తుల కేసు.. ఇవీ పూర్తి వివరాలు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)