Breaking News

కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌కు అహ్మదాబాద్‌ కోర్టు నోటీసులు.. కారణం ఇదే..

Published on Mon, 04/17/2023 - 11:06

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివాదంపై కేజ్రీవాల్‌కు మరోసారి షాక్‌ తగిలింది. ఈ వివాదంపై తాజాగా కేజ్రీవాల్‌ సహా ఆప్‌ ఎంపీ సంజయ్‌కు అహ్మదాబాద్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23వ తేదీలోపు సమాధాని ఇవ్వాలన్ని నోటీసుల్లో పేర్కొంది. 

వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ డిగ్రీ అర్హతను ప్రశ్నిస్తూ కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌ గుజరాత్‌ యూనివర్సిటీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే, వారు ఉద్దేశపూర్వకంగా గుజరాత్‌ యూనివర్సిటీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారని వర్సిటీ రిజిస్ట్రార్‌ పీయూష్‌ పటేల్‌ క్రిమినల్‌ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ అహ్మదాబాద్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23లోగా స్పందించాలని ఆదేశిస్తూ అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ జయేశ్‌భాయ్‌ చోవాటియా  ఆదేశించారు. 

ఇక, అంతకుముందు.. ప్రధాని మోదీ డిగ్రీపై కేజ్రీవాల్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్స్‌ ఉంటే.. వర్సిటీ ఎందుకు బయటపెట్టడం లేదు. ఫేక్‌ సర్టిఫికెట్‌ కాబట్టే వర్సిటీ బయటపెట్టడం లేదేమో అని అన్నారు. ప్రధాని తమ విద్యార్థి అని ఢిల్లీ, గుజరాత్‌ వర్సిటీలు చెప్పుకునేవి కదా! అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక, ఆప్‌ ఎంపీ సంజయ్‌.. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్‌ నకిలీదని వర్సిటీ నిరూపించిందన్నారు. 
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)