Breaking News

ఇంతోటిదానికి పవన్‌ ఆదేశాలు.. కమిటీలు.. ఫోటోలకు ఫోజులు!

Published on Tue, 03/18/2025 - 17:49

కాకినాడ, సాక్షి: చిత్రాడ.. మొన్నటిదాకా కాలుష్యం అనే పదానికి అల్లంత దూరాన ఉన్న గ్రామం. ఎప్పుడైతే జనసేన, ఆ పార్టీ కార్యకర్తలు అడుగు మోపారో.. ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి!!. పొరపాటున అభివృద్ధి విషయంలో అనుకునేరు!!. విపరీతమైన కాలుష్యం, ఎటు చూసినా చెత్తాచెదారం.. ఫ్లెక్సీలతోనే ఆ మార్పు అంతా!!.

మొన్నీమధ్యే జరిగిన జనసేన ఆవిర్భావ సభ.. చిత్రాడ(పిఠాపురం)కు విపరీతమైన కాలుష్యాన్ని మిగిల్చింది. అందుకు కారణం.. అక్కడి చెత్తను తరలించకపోవడం ఒకటైతే.. దానిని అక్కడికక్కడే పోగేసి కాల్చేయడం. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చపోగా.. పైగా బోనస్‌గా కాలుష్యాన్ని అంటగట్టారంటూ జనసేనను తిట్టిపోస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు.

జనసేన సభ తర్వాత.. ఇవాళ్టికి అక్కడి రోడ్లపై ఇంకా జనసేనవారి ఫ్లెక్సీలు, వెల్‌కమ్‌ బ్యానర్లు.. ఆఖరికి భారీ ఆర్చ్‌లు కూడా అలాగే ఉండిపోయాయి. వాటిని తొలగించడానికి ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ ముసుగేసి పడుకుంది. దీంతో పవన్‌ పర్యవేక్షణలో ఉన్న ఓ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉపాధి హామీ కూలీలతో ఆ చెత్త ఏరివేయించారు.

నాదెండ్ల స్వయంగా ప్రకటించి..
తమది చాలా క్రమశిక్షణ గల పార్టీ అని, సభ తరువాత సభా ప్రాంగణాన్ని శుద్ది చేస్తామని జనసేన సీనియర్‌, మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు. సభ అనంతరం ప్రాంగణాన్ని శుద్ది చేసి..ఫ్లెక్సీలు తొలగించాలని తమ అధినేత పవన్ ఆదేశించినట్లు చెప్పారాయన. ఈ క్రమంలోనే..

కాకినాడ ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారాయన. అయితే మరుసటి రోజు జనసేన నేతలు సభా ప్రాంగణానికి వచ్చారు. శుద్ధి చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అదయ్యాక అక్కడి నుంచి గాయబ్‌ అయ్యారు. ఈలోపు..  పవన్ సొంత శాఖలోని ఉపాధి హమీ కూలీలు ఆ ప్లాస్టిక్ వ్యర్ధాలను డంపింగ్ యార్డుకు తరలించకుండా.. అక్కడే గుట్టలుగా పోసి దగ్ధం చేశారు. దీంతో విపరీతమైన కాలుష్యంతో ఆ ప్రాంతమంతా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)