జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన?

Published on Tue, 06/11/2024 - 05:29

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొత్తనేతను నియమించాకే, రాష్ట్ర నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలున్నాయి. జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ.నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డిలను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్న విషయం తెలిసిందే. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అటు నడ్డాను, ఇటు కిషన్‌రెడ్డిని తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగించిన విషయం తెలిసిందే. ఇద్దరూ కేబినెట్‌లో ఉండటంతో వీరిస్థానంలో అధ్యక్ష బాధ్యతలు వేరే వారికి అప్పగించనున్నారు. కర్ణాటకతోపాటు రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఏపీ, తమిళనాడు, కేరళలలో బలపడాలని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది.  

రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నేతకే అవకాశం ? 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ, ఎమ్మెల్యేల్లో ఒకరి అవకాశం ఉంటుందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఓసీ సామాజికవర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేఎల్పీనేతగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీ సామాజికవర్గానికే చెందిన ఇస్తారని అంటున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఎజెండాతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లింది. అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని హామీ కూడా ఇచ్చింది. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థలు, ఆ తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో జరగాల్సిన మున్సిపల్‌ ఎన్నికల్లో సతా చాటడం అత్యవసరంగా పార్టీ నాయకత్వం భావిస్తోంది. 

ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ పేరు రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపుగా ఖరారైనట్టుగా పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితుడైన నేతగా, బీసీలతోపాటు అన్నివర్గాల్లో గుర్తింపు ఉన్న వ్యక్తిగా, ఇరవై ఏళ్ల పాటు బీఆర్‌ఎస్‌లో నంబర్‌ –2గా, మంత్రిగా ఈటలకున్న అనుభవం బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతుందని పార్టీ నాయకత్వం గట్టిగా విశ్వసిస్తోంది. 

రాజకీయంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసినందున, సంస్థాగతంగా బలపడేలా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వచ్చేలా పార్టీని అన్నివిధాలా సంసిద్ధం చేసుకునేందుకు ఉపయోగపడే నేతలకే అధ్యక్ష పదవి దక్కుతుందదని భావిస్తున్నారు. అయితే రాష్ట్రపార్టీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వారిలో ఎంపీలు అర్వింద్, డీకే.అరుణ, రఘునందన్‌రావు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు యెండల లక్ష్మీనారాయణ, కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌తోపాటు మరికొందరు ఉన్నారు.  
   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)