Breaking News

ప్రముఖ కంపెనీ మాజీ హెచ్‌ఆర్ హెడ్.. ఒడిశా అభ్యర్థుల్లో రిచెస్ట్‌

Published on Wed, 05/08/2024 - 11:25

ఆదిత్య బిర్లా గ్రూప్ మాజీ హెచ్‌ఆర్ హెడ్, ప్రస్తుత లోక్‌సభ ఎన్నిలల్లో కటక్ నుంచి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంతృప్త్‌ మిశ్రా సుమారు రూ. 461 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశా అభ్యర్థుల్లో ఈయనే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు.

సంతృప్త్‌ మిశ్రా  ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత గత ఫిబ్రవరిలో బీజేడీలో చేరారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం, ఆయన ఆదాయపు పన్ను రిటర్న్స్ 2021-22లో రూ. 76.23 కోట్లు, 2022-23లో రూ. 66.21 కోట్లుగా ఉన్నాయి. నామినేషన్ దాఖలు సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో రూ.408 కోట్ల విలువైన చరాస్తులు, రూ.4 కోట్ల బ్యాంకు డిపాజిట్లు సహా రూ.53 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు.

మ్యూచువల్ ఫండ్స్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, బాండ్‌లు, షేర్లలో మిశ్రా పెట్టుబడి మొత్తం ప్రస్తుత విలువ దాదాపు రూ. 308 కోట్లు. రూ.2.3 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన కార్లు ఆయనకున్నాయి. ఇక మిశ్రా భార్య చరాస్తుల విలువ రూ. 11.72 కోట్లు అని నివేదిక పేర్కొంది. ఒడిశాలో ఎటువంటి స్థిరాస్తి లేనప్పటికీ, మిశ్రాకు మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో వ్యవసాయ భూమి, హైదరాబాద్, ముంబైలలో ఫ్లాట్‌లు ఉన్నాయి.

కాగా ఒడిశాలో 21 లోక్‌స్థానాలు, 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నింటికీ ఏక కాలంలో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సంతృప్త్‌ మిశ్రా పోటీ చేసే కటక్‌ లోక్‌సభ స్థానానికి మే 25న ఆరో దశలో పోలింగ్‌ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్‌ 4న జరుగుతుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)