Breaking News

‘ఖర్గే చెప్పినా.. నా పోరాటం ఆగదు’

Published on Sun, 05/19/2024 - 13:02

కోల్‌కతా: బెంగాల్‌  సీఎం మమతా బెనర్జీపై మరోసారి కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ అధీర్‌ రంజన్ చౌదరీ విమర్శలు చేశారు. తనను, కాంగ్రెస్‌ పార్టీని అంతం చేయాలనుకున్న సీఎం మమతా బెనర్జీ గురించి తాను సానుకూలంగా  మాట్లాడనని అన్నారు. 

‘‘నన్ను, కాంగ్రెస్‌ పార్టీని అంతం చేయాలనుకున్న వారికి తాను సానుకూలంగా మాట్లాడాను. ఇది ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త  పోరాటం. కాంగ్రెస్‌ కార్యకర్తల తరఫునే నేను సానుకూలంగా మాట్లాడుతాను. సీఎం మమతపై నాకు ఎటువంటి వ్యక్తిగతమైన పగ లేదు. 

..ఆమె అవలంబిస్తున్న రాజకీయ విలువలను ప్రశ్నిస్తాను. ఆమె వ్యక్తిగత అజెండా​ కోసం కాంగ్రెస్‌ను  ఉపయోగపడాలని నేను అనుకోవటం లేదు. నా వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు వ్యతిరేకించినా.. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలోని కార్యకర్తల కోసం ఒక కాంగ్రెస్‌ నేతగా సీఎం మమతకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా’’అని అధీర్‌ రంజన్‌ స్పష్టం చేశారు.

అంతకు ముందు అధీర్‌ రంజస్‌ సీఎం మమాతపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉంటారన్న నమ్మకం లేదు. బీజేపీ చేరువ కానున్నారు. బెంగాల్‌లోని పురూలియా, బంకురా, ఝార్‌గ్రామ్ జిల్లాల్లో లెఫ్ట్‌ పార్టీలను అప్రతిష్టపాలు చేసేందుకు సీఎం మమతా మావోయిస్టుల సహాయాన్ని కోరారు’’ అని అధీర్‌ రంజన్‌ ఆరోపణలు చేశారు.

అయితే ఆధీర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలపై శనివారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘‘మమతా బెనర్జీ కూటమిలోనే ఉన్నారు. ఇటీవల ఆమె కూటమిలో నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో చేరుతానని తెలిపారు. ఆధీర్‌ రంజన్ పార్టీ కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. కీలకమైన నిర్ణయాలను పార్టీ అధ్యక్షుడిగా నేను, పార్టీ హైకమాండ్‌ మాత్రమే  తీసుకుంటుంది. తమ  నిర్ణయాలను పాటించని వారు బయటకు వెళ్లిపోతారు’’ అని ఖర్గే స్పష్టం చేశారు. మరోవైపు.. అధీర్‌ రంజన్‌ బహరాంపూర్‌ నుంచి పోటీ చేయగా.. టీఎంసీ ఈ స్థానంలో మాజీ క్రికెట్‌ క్రీడాకారుడు యూసుఫ్‌ పఠాన్‌ను బరిలోకి దించింది.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)