Breaking News

ఊపందుకున్న ఆపరేషన్‌ ఆకర్ష్‌.. బీజేపీలోకి జయసుధ?

Published on Tue, 08/09/2022 - 12:19

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా బీజేపీ జాయినింగ్‌ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేంద్ర.. మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధతో మంగళవారం సమావేశమై పార్టీలో చేరికకు సంబంధించిన చర్చలు దాదాపు పూర్తిచేసినట్లు సమాచారం.

ఒకవైపు సినీరంగ ప్రముఖులు, మరోవైపు మేధావి వర్గంపైనా బీజేపీ గురిపెట్టింది. ఈ నెల 21న అమిత్‌ షా సమక్షంలో పలువురు రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ల చేరికకు బీజేపీ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. అటు ప్రజాసంఘాల మద్దతును కూడా కోరుతున్నారు. అమిత్‌ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో భారీగా పార్టీలో చేరికలకు ఈటల రాజేంద్ర ప్లాన్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే, జయసుధ గతంలో సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆమె రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. సికింద్రాబాద్‌ నియోజకవర్గ పరిధిలో జయసుధ కొంత పట్టుండటంతో ఆమెను పార్టీలోకి తీసుకొనేందుకు బీజేపీ ఆసక్తి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్‌ షా పర్యటన సందర్భంగా పార్టీలో చేరాలని ఈటల రాజేంద్ర.. జయసుధను కోరినట్లు సమాచారం.

చదవండి: ('అందుకోసమే బీజేపీ రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించింది')

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)