Breaking News

పోటీ చేస్తాననడం రూమర్‌ మాత్రమే: జయసుధ

Published on Wed, 08/02/2023 - 16:42

సాక్షి, ఢిల్లీ: సినీ నటి, సికింద్రాబాద్‌ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో అధికారికంగా చేరారు. బుధవారం సాయం‍త్రం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ ఆమెకు కండువా కప్పి కాషాయం పార్టీలోకి ఆహ్వానించారు. ప్రాథమిక సభ్యత్వం అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

‘‘ఎమ్మెల్యేగా నా పదవీకాలం పూర్తయ్యాక.. కొన్ని కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నా. ప్రధానమంత్రి మోదీ పరిపాలన నచ్చి బీజేపీలో చేరాను. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీలోకి వచ్చా. దాదాపు ఏడాదిగా బీజేపీలో చేరాలని ఆలోచిస్తున్నాను. జాతీయ పార్టీ ద్వారా ప్రజలకి సేవ చేస్తా. పార్టీ ద్వారా క్రైస్తవుల కోసం పని చేస్తా. కులమతాలకు అనుగుణంగా సేవలు అందిస్తా. సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌ నుంచి పోటీ చేస్తాననడం రూమర్‌ మాత్రమే’’
:::జయసుధ

 

‘‘సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ పనిచేశారు, 350కి పైగా సినిమాలలో నటించారు. జయసుధ చేరికతో బీజేపీ బలోపేతం అవుతుంది. BRS ఓటమి తోనే తెలంగాణ అమరుల ఆకాంక్ష నెరవేరుతుంది. పేదల సంక్షేమం, బస్తీల అభివృద్ధి విషయంలో జయసుధకు చిత్తశుద్ది ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే కుటుంబ పాలన, నియంతృత్వ పాలన పోవాలి అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన రావాలి.’’
:::కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్

జయసుధకు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఈ తొమ్మిదేళ్లలో మోదీ పాలన.. అభివృద్ధిని చూసి ఆమె బీజేపీలో చేరారు. జయసుధ చేరిక బీజేపీకి ఉత్సాహాన్ని ఇస్తుంది.
:::తరుణ్‌చుగ్‌, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)