Breaking News

డ్ర‌గ్స్‌ను అరిక‌ట్ట‌డంలో డీఎంకే ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది: న‌టుడు విజ‌య్‌

Published on Fri, 06/28/2024 - 14:43

చెన్నై:  త‌మిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజ‌య్.. డీఎంకే ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.  రాష్ట్రంలో డ్ర‌గ్స్ మాఫియా రాజ్య‌మేలుతోంద‌ని, దీనిని అరిక‌ట్ట‌డంలో ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని విజ‌య్ ధ్వ‌జ‌మెత్తారు. మాద‌కద్ర‌వ్యాల‌ను నియంత్రించేందుకు స్టాలిన్ స‌ర్కార్ ఏ ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌ని ఆరోపించారు.

విజ‌య్ మాట్లాడుతూ.. 'ఇటీవ‌ల కాలంలో త‌మిళనాడు యువ‌త‌లో డ్ర‌గ్స్ వాడ‌కం ఎక్కువ‌గా ఉంది. ఒక పేరెంట్‌గా, రాజ‌కీయ పార్టీ నాయ‌కుడిగా నేనే దీని గురించి భ‌య‌ప‌డుతున్నాను. యువతను డ్రగ్స్ నుంచి రక్షించడం ప్రభుత్వ కర్తవ్యం. కానీ ఈ విష‌యంలో ప్రస్తుత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో మంచి నాయకులు రావాల్సిన అవసరం ఉందిస‌ అని పేర్కొన్నారు.

కాగా స్టాలిన్ ప్రభుత్వంపై విజయ్ నేరుగా విమ‌ర్శ‌లు చేయడం ఇదే తొలిసారి. అయితే వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ పార్టీ పోటీ చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మొద‌లు పెట్టాల‌ని యోచిస్తున్న త‌రుణంలో ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. 

ఇదిలా ఉండ‌గా.. త‌మిళ‌నాడులోని కళ్లకురిచిలో ఇటీవ‌ల క‌ల్తీ సారా తాగ‌డం వ‌ల్ల 60 మంది మృత్యువాత ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ మరణాలపై  జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టి, వారంలోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. నివేదికను దాఖలు చేసేందుకు మద్రాసు హైకోర్టు జూలై 3 వరకు గడువు ఇచ్చింది.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)