Breaking News

జీవన్‌ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య కేసులో కీలక పరిణామం​

Published on Fri, 10/25/2024 - 19:38

జగిత్యాల జిల్లా: జిల్లాలో సంచలనం రేపిన  కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు బత్తిని సంతోష్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ నిందితుడి వివరాల్ని వెల్లడించారు.  

నిందితుడు సంతోష్‌ గ్రామంలో గీతకార్మికుడు. నిందితునిపై ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నాయి. 15 సంవత్సరాలుగా నిందితుడికి భూ తగాదా కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసు పెట్టించింది కూడా గంగారెడ్డే. కొద్ది రోజుల క్రితం కేసు విషయంలో రాజీ కుదుర్చుకునేందుకు సంతోష్‌ ప్రయత్నించాడు. ఆ సమయంలో గంగారెడ్డి,సంతోష్‌ మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి గంగారెడ్డిపై సంతోష్‌ కోపం పెంచుకున్నాడు. పథకం ప్రకారం బైక్‌పై హోటల్‌ నుంచి ఇంటికి వెళ్తున్న గంగారెడ్డిని కారుతో ఢీకొట్టాడు. అనంతరం హత్య ఎస్పీ తెలిపారు. నిందితుడి వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ వివరించారు.

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి హత్య జగిత్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్‌ మాజీ ఎంపీటీసీ గంగారెడ్డిని 20 ఏళ్ల వయస్సున్న సంతోష్‌ అనే యువకుడు దారుణంగా హత మార్చాడు. పథకం ప్రకారం ముందుగా హోటల్‌ నుంచి ఇంటికి వెళ్తున్న గంగారెడ్డిని వెంటాడి కారుతో ఢీకొట్టాడు. కింద పడిపోయిన గంగారెడ్డిపై 20కిపైగా కత్తిపోట్లు పొడిచాడు. హత్య చేసి పారిపోతున్న వీడియో సీసీ కెమెరాల్లో రికార్డైంది. కొన ఊపిరితో ఉన్న ఆయనను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)