Breaking News

‘నన్ను చంపేస్తారేమో’.. ఎమ్మెల్యే వీడియో కలకలం

Published on Thu, 09/04/2025 - 15:18

హర్యానా: యాంటీ గ్యాంగ్‌స్టర్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఏజీటీఎఫ్‌)తనని ఎన్‌కౌంటర్‌ చేస్తోందని ప్రాణ భయంతో పోలీసుల నుంచి తప్పించుకు తిరగానంటూ ఓ పార్టీ ఎమ్మెల్యే రహస్య ప్రాంతం నుంచి వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో తనని అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన పోలీసులపై దాడులకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.ఇంతకీ పోలీసుల్ని తప్పించుకున్న ఎమ్మెల్యే ఎవరు?. పోలీసులు తనని ఎన్‌కౌంటర్‌ చేస్తారేమోనని ఎందుకు భయపడ్డాడు.

పంజాబ్‌లోని అధికార ఆప్‌కు చెందిన హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే హర్‌ప్రీత్‌పై జిరాక్‌పూర్‌కు చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది.  భార్య నుంచి విడాకులు, 2011లో తనని వివాహం చేసుకోవడం, తర్వాత ప్రైవేట్‌ వీడియోలు తీసి బెదిరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు హర్యానాలోని కర్నాల్‌ జిల్లా దబ్రి గ్రామంలోని నివాసంలో ఉన్న హర్మీత్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకునేందుకు పటియాలా పోలీసు బృందం అక్కడికి చేరుకుంది.

పోలీసుల రాకపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే హర్‌ప్రీత్‌ అజ్ఞాతంలోకి వెళ్లారు. వెళ్లే సమయంలో హరీప్రత్‌ గ్రామస్థులు, అతని అనుచరులు పోలీసులపైకి దాడికి పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలో అజ్ఞతం నుంచి ఎమ్మెల్యే హర్‌ప్రీత్‌.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో పోలీసులు నన్ను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు ప్లాన్‌ చేశారనే సమాచారం అందింది. నన్ను ఒక్కడిని ఎన్‌కౌంటర్‌ చేసేందుకు ఎనిమిదిమంది ఎస్పీలు, ఎనిమిదిమంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్‌హెచ్‌ఓలు,ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు బిక్రమ్ బ్రార్‌లు పట్టుకునేందుకు వచ్చారు. పోలీసులంటే నాకు అపారమైన గౌరవం ఉంది. నేను వాళ్లమీద ఎటువంటి దాడులకు పాల్పడలేదని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. 
  
ఈ ఘటనపై పాటియాలా రేంజ్‌ డీఐజీ కుల్దీప్‌ చాహల్‌ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే హర్‌ప్రీత్‌సింగ్‌ కోసం ఆయన స్వగ్రామానికి వెళ్లాం. మేం వస్తున్నామనే సమాచారంతో ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే హర్‌ప్రీత్‌ సింగ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు.పాటియాలా క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ఇన్‌ఛార్జ్‌ ప్రదీప్‌ బాజ్వా ఆప్‌ ఎమ్మెల్యే అరెస్టును ధృవీకరించారు. ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడులకు పాల్పడ్డారు. రాళ్లు రువ్వారు. ప్రతిఘటించేందుకు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిపారు.

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)