Breaking News

Delhi Elections: ఆప్‌కు భారీ షాక్‌..

Published on Sat, 02/01/2025 - 07:07

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపధ్యంలో రాజధానిలో వివిధ రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి.  ఇటువంటి సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి షాక్‌ తగిలింది.

కేజ్రీవాల్‌ సారధ్యంలోని ఆప్‌ పార్టీలో అసంతృప్తి నెలకొంది. టికెట్లు దక్కకపోవడంతో ఆగ్రహించిన ఎనిమిదిమంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో జనక్‌పురి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ రిషి, కస్తూర్బా నగర్ ఎమ్మెల్యే మదన్ లాల్, మెహ్రౌలి ఎమ్మెల్యే నరేష్ యాదవ్, త్రిలోక్‌పురి ఎమ్మెల్యే, దళిత నేత రోహిత్ కుమార్, పాలం ఎమ్మెల్యే భావన గౌర్, బిజ్వాసన్ ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ జూన్ ఉన్నారు.

వీరంతా తమ రాజీనామా పత్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)తో పాటు అరవింద్ కేజ్రీవాల్‌పై పలు ఆరోపణలు చేశారు. ఈ ఎమ్మెల్యేలకు పార్టీ తిరిగి టిక్కెట్లు ఇవ్వలేదు. ఇంతవరకూ మౌనం వహించినవారంతా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంతో రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన వారిలో ఒకరైన రోహిత్ కుమార్ మెహ్రోలియా తన రాజీనామా పత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘వారికి బాబా సాహెబ్‌ ఫొటో మాత్రమే కావాలి. ఆయన ఆలోచనలు కాదు. అలాంటి అవకాశవాద, కృత్రిమ వ్యక్తులతో నా సంబంధాన్ని ముగించుకుంటున్నాను’ అని రాశారు.

ఇదేవిధంగా ‘పార్టీ ప్రాథమిక సభ్యత్వం(Membership)తో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను.ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో చిక్కుకుంది’ అని పేర్కొంటూ మెహ్రౌలి ఎమ్మెల్యే నరేష్ యాదవ్ రాజీనామా చేశారు. అవినీతికి వ్యతిరేకంగా సాగిన అన్నా ఉద్యమం కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్భవించిందని, కానీ నేడు ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోవడం బాధాకరంగా ఉందని నరేష్ యాదవ్ పేర్కొన్నారు.

పాలం ఎమ్మెల్యే భావన గౌర్ తన రాజీనామాలో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీపై తనకు ఇకపై నమ్మకం లేదని స్పష్టంగా రాశారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తూ ‘ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీ సిద్ధాంతం నుండి వైదొలిగిందని’పేర్కొన్నారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా తమ రాజీనామా పత్రాలలో ఇటువంటి ఆరోపణలు చేశారు.

ఇది కూడా చదవండి: మరొకరిని బలిగొన్న పూణె వైరస్‌

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)