Breaking News

కేజ్రీవాల్‌ కారుపై రాయితో దాడి: బీజేపీ పనే అంటోన్న ఆప్‌!

Published on Sat, 01/18/2025 - 18:09

న్యూఢిల్లీ:  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election 2025) ప్రచారంలో  భాగంగా ఈరోజు(శనివారం) ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) అధ్యక్షుడు,  ఢిల్లీ  మాజీ సీఎం అరవింద్‌  కేజ్రీవాల్‌  కారుపై  దాడి జరిగింది. అరవింద్‌ కేజ్రీవాల్‌(arvind kejriwal) కారులో వెళుతున్న సమయంలో రాయి వేశాడో  దుండగుడు.  అయితే ఇది బీజేపీ పనే అని ఆప్‌ ఆరోపిస్తోంది.

‘బీజేపీ(BJP)కి భయం పట్టుకుంది. బీజేపీ బాగా భయాందోళనకు గురౌతోంది. దాంతోనే  దాడులకు దిగుతోంది. ఈ క్రమంలోనే అరవింద్‌  ేజ్రీవాల్‌ కారుపై దాడి చేశారు’ అని మాటల యుద్ధానికి దిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆప్‌ తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ‘ఎక్స్‌’లో  పోస్ట్‌ చేసింది.

ఈ  మేరకు వీడియోతో పాటు  బీజేపీపై పలు ఆరోపణలు చేసింది ఆప్‌.  బీజేపీ అభ్యర్థి పర్వేష్‌ వర్మ.. అరవింద్‌ కేజ్రీవాల్ ను రాళ్లతో టార్గెట్‌ చేశారు. ఎందుకంటే ఆయన ప్రచారం  చేయలేకపోతున్నారు  కాబట్టి రాళ్లతో దాడులకు దిగుతోంది.  ఏం జరిగినా కేజ్రీవాల్‌వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. దీనికి ఢిల్లీ  ప్రజలు మీకు గట్టిగానే బుద్ధి చెబుతారు’ అని ఆప్‌   ట్వీట్‌లో పేర్కొంది.

నల్లరంగు ఎస్‌యూవీలోకేజ్రీవాల్‌ వెళుతున్న సమయంలో, చుట్టూ సెక్యూరిటీ ఉండగా కొంతమంది నిరసనకారులు ఆందోళనకు దిగారు.  దీనిలో భాగంగా కేజ్రీవాల్‌  కారును అడ్డగించారు. ఆ సమయలో ఒక పెద్దరాయి కేజ్రీవాల్‌ కారుపై వచ్చి పడింది.  దాంతో అప్రమత్తమైన సెక్యూరిటీ  సిబ్బంది..  కేజ్రీవాల్‌ ను అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఆప్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది.


 

కాగా   గత రెండు పర్యాయాలుగా ఢిల్లీలోఆప్‌ అధికారాన్ని చేపట్టింది. 2013  నుంచి ఇప్పటివరకూ ఆప్‌ ఢిల్లీలో అధికారంలో ఉంది. అయితే ఈసారి ఎలాగైనా ఢిల్లీ పగ్గాల్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ గట్టిగా  ప్రయత్నిస్తోంది.  ఆప్‌కు  ధీటుగా ప్రచారాన్నిసాగిస్తూ బీజేపీ సైతం దూసుకుపోతోంది. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా వీరిద్దరి  ప్రచారం నువ్వా-నేనా అన్నట్లు  సాగుతోంది.  ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)