Breaking News

AAP: రెండు రాష్ట్రాల్లో అభ్యర్థుల ప్రకటన.. ఢిల్లీలో తొలిసారి ఇలా!

Published on Tue, 02/27/2024 - 21:23

ఢిల్లీ: లోక్‌సభ ఎ‍న్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీతో ఆప్ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆప్ మంగళవారం.. ఢిల్లీ, హర్యానాలో తమ పారట​ఈ నుంచి పోటీ చేసే లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది.

సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ మూడు సీట్లలో పోటీ చేయగా.. ఆప్‌ నలుగురు అభ్యర్థుల పేర్లను రిలీజ్‌ చేసింది. ఆప్‌ సీనియర్‌ నేత సోమనాథ్‌ భారతీకి న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం, సహిరామ్ పెహల్వాన్ (దక్షిణ ఢిల్లీ), మహాబల్ మిశ్రా (పశ్చిమ ఢిల్లీ) మరియు కుల్దీప్ కుమార్ (తూర్పు ఢిల్లీ) సెగ్మెంట్లను ఆప్‌ ప్రకటించింది.పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ 3 స్థానాల్లో పోటికి దిగనుంది.

ఇక.. హర్యానా రాష్ట్రంలోని  కురుక్షేత్ర నియోజకవర్గంలో ఆప్‌ లోక్‌ సభ అభ్యర్థి సుశీల్ గుప్తాను బరిలోకి దింపుతున్నట్లు పేర్కొంది.  లోక్‌సభ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో ఆప్‌ అభ్యర్థులు  పోటీ చేస్తామని.. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలోకి దింపుతున్నట్లు ఆప్ సీనియర్ నేత సందీప్ పాఠక్  వెల్లడించారు. ప్రకటించిన అభ్యర్థుల ఎంపిక తీవ్రంగా కసరత్తు చేశామని, పలుసార్లు చర్చించి పార్టీ లెక్కల ప్రకారమే బరిలో నిలుపుతున్నామని ఆప్‌ సీనియర్‌ నేత గోపాల్‌ రాయ్‌ పేర్కొన్నారు.  తాము పోటీ చేసే ప్రతి సీట్లలో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే ఆప్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. జనరల్‌ స్థానం అయిన తూర్పు ఢిల్లీ లోక్‌ సభ స్థానంలో ఎస్సీ అభ్యర్థిని పోటీ నిలుపుతున్నామని చెప్పారు. కుల్దీప్‌ కుమార్‌ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. లోక్‌సభ ఎన్నికల్లో జనరల్‌ స్థానంలో ఎస్సీ అభ్యర్థిని పోటీనికి నిలపటం ఢిల్లీ ఇదే తొలిసారి అని తెలిపారు. కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆప్‌ మొదటి నుంచి ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడేవారికే టికెట్లు ఇస్తూ వస్తోందని పేర్కొన్నారు.
 

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)