Breaking News

50కి పైగా కంపెనీలు..1600 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు

Published on Sat, 03/16/2024 - 13:09

సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన 50కి పైగా కంపెనీలు రూ.1,600 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసినట్లు తేలింది.    

రూ.1,600 కోట్లలో మదన్‌లాల్ లిమిటెడ్,ఎంకేజీ ఎంటర్‌ప్రైజెస్, కెవెంటర్స్ ఫుడ్ పార్క్ వంటి సంస్థలు రూ. 600 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేయగా, వాటిల్లో కెవెంటర్ గ్రూప్ భారీ మొత్తంలో బాండ్ల రూపంలో డిపాజిట్‌ చేసినట్లు తెలుస్తోంది. 

కెవెంటర్ గ్రూప్ తర్వాత ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ హల్దియా ఎనర్జీ, ధరివాల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ కంపెనీలు దాదాపు రూ.500 కోట్లను ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో ఆయా పార్టీలకు విరాళం ఇచ్చాయి.  

ఈ కంపెనీలతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చాయి. వాటిల్లో ఐటీసీ,  రుంగ్తా గ్రూప్, రష్మీ గ్రూప్, అంబుజా, శ్యామ్ స్టీల్, ఐఎఫ్‌బీ గ్రూప్, రిప్లే, శ్రీ సిమెంట్, ధున్సేరి గ్రూప్, ఉత్కర్ష్ గ్రూప్, స్టార్ సిమెంట్, డబ్ల్యూపీఐఎల్‌, టెగా ఇండస్ట్రీస్, అక్రోపోలిస్ మెయింటెనెన్స్, ఎస్‌కేపీ మర్చంట్స్, ఆస్టిన్ ప్లైవుడ్స్ ఉన్నాయి.

ఇక, ఏప్రిల్ 12, 2019 నుంచి ఫిబ్రవరి 15, 2024 మధ్య కాలంలో సుమారు 1,260 కంపెనీలు, వ్యక్తులు సుమారు రూ.12,155.51 కోట్ల విలువైన 22,217 బాండ్లను కొనుగోలు చేసినట్లు ఎస్‌బీఐ డేటా చూపించింది. ఈ కాలంలో రూ.12,769.09 కోట్ల విలువైన 20,421 బాండ్లను 23 రాజకీయ పార్టీలు రీడీమ్ చేశాయి. బీజేపీ రీడమ్‌ చేసి రూ.6,061 కోట‍్లను పార్టీ కార్యకలాపాలకు వినియోగించుకోవగా రూ.1,610 కోట్లను తృణమూల్ కాంగ్రెస్, రూ.1,422 కోట్లను కాంగ్రెస్ రీడమ్‌ చేసుకుంది. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)