Breaking News

400 ఓ జోకు.. 200 సీట్లే కష్టం: బీజేపీపై ఎంపీ శ‌శిథ‌రూర్‌ సెటైర్లు

Published on Thu, 05/02/2024 - 17:04

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తాము 400 స్థానాల్లో గెలుస్తామంటూ బీజేపీ చెప్పడం ఒక జోక్‌ అని అన్నారు. కాషాయ పార్టీకి 300 సీట్లు రావడం ఆసాధ్యమని, కనీసం 200 స్థానాల్లో గెలవడం కూడా సవాలేనని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పటికే త‌న ఓట‌మిని అంగీక‌రించింద‌న్నారు.

ఈ మేరకు జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఖాతా కూడా తెరిచే అవకాశం లేదని చెప్పారు. మొత్తంగా దక్షిణ భారత్‌లో 2019 ఫలితాల కంటే దారుణంగా ఫెయిల్‌ అవుతుందని చెప్పారు.

కాగా గత నెల 26న పోలింగ్‌ జరిగిన రెండో దశ లోక్‌సభ ఎన్నికల్లో శశిథరూర్‌ తిరువనంతపురం స్థానం నుంచి బరిలో నిలిచారు. అక్కడ బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, సీపీఐ నుంచి పీ రవీంద్రన్‌ పోటీ పడుతున్నారు. తిరువనంతపరంలో తన గెలుపు చాలా సులువగా ఉంటుందని ఆయన చెప్పారు.

ఇక గత మూడుసార్లు ఆయన తిరువనంతపురం నుంచి ఎంపీగా విజయం సాధించారు.  ఈసారి కూడా గెలిస్తే  నాలుగో సారి వ‌రుస‌గా ఆ స్థానాన్ని కైవ‌సం చేసుకున్న‌ట్లు అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 190 స్థానాల‌కు దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని, వాటిల్లో ఎక్కువ శాతం త‌మ‌కే అనుకూల ఫ‌లితాలు వెలుబ‌డే ఛాన్సు ఉన్న‌ట్లు చెప్పారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి