Breaking News

కేరళలో ముస్లిం ఓట్లు.. ‘గేమ్‌ చేంజర్‌’?

Published on Thu, 04/11/2024 - 11:16

దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఓటర్లను ఆకట్టకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 20 లోక్‌సభ స్థానాలున్న కేరళలో ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలో 24 శాతమున్న ముస్లింల ఓటింగ్ సరళిపైనే అందరి దృష్టి నెలకొంది. ఇది ఎన్నికల్లో గేమ్ చేంజర్‌ కానున్నదననే మాట వినిపిస్తోంది. 

కేరళలోని 3.30 కోట్ల జనాభాలో ముస్లింల జనాభా 24 శాతం కాగా, క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినవారు 17 శాతం  ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ 19 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ కమలం వికసించలేకపోయింది. 2019లో ముస్లింలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌కు ఓటు వేశారు. అయితే సీఎం విజయన్ ఈ ట్రెండ్‌ను తిప్పికొట్టి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ముస్లిం ఓట్లను దక్కించుకున్నారు.

ఈసారి కూడా ముస్లింల ఓటింగ్‌ సరళి నిర్ణయాత్మక అంశంగా మారనుంది. ఈ నేపధ్యంలో ముస్లిం సమాజాన్ని ప్రభావితం చేసేందుకు వామపక్షాలు, కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడో స్థానంలో నిలిచి, కేవలం 15.64 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది.

రాష్ట్రంలో అత్యధికంగా 19 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో 47.48 శాతం ఓట్లను దక్కించుకుంది. అదే సమయంలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌కు కేవలం ఒక్క సీటు మాత్రమే లభించగా, 36.29 శాతం ఓట్లు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎంల మధ్య  గట్టి పోటీ  ఉండనుంది. ఇదే సమయంలో బీజేపీ కూడా కొన్ని సీట్లు గెలవాలని ప్రయత్నిస్తోంది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)