Breaking News

రాజస్తాన్‌లో 157 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు 

Published on Sat, 10/21/2023 - 02:36

సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్తాన్‌ రాష్ట్రంలో 157 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న మొత్తం 108 ఎమ్మెల్యేల్లో 88 మంది, ప్రతిపక్ష పార్టీ బీజేపీకి ఉన్న 69 మంది ఎమ్మెల్యేల్లో 54 మంది, 14 మంది ఇండిపెండెంట్లలో 12 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫారŠమ్స్‌(ఏడీఆర్‌) వెల్లడించింది. ధోడ్‌ (ఎస్సీ) నియోజకవర్గ సిట్టింగ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పరశురామ్‌ మోర్దియా రూ.172 కోట్లతో అత్యధిక ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేగా నిలిచారు.

కాగా, చోరాసి(ఎస్టీ) నియోజకవర్గ భారతీయ ట్రైబల్‌ పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ రూ.1.22 లక్షలతో రాష్ట్రంలో అతి తక్కువ ఆస్తిపరుడైన ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం ఉదయ్‌పూర్‌ అసెంబ్లీ నియోజకర్గం ఖాళీగా ఉన్న నేపథ్యంలో 199 నియోజకవర్గాల ప్రస్తుత ఎమ్మెల్యేల ఆస్తులు, నేరచరిత్ర తదితర అంశాలపై సమీక్ష చేపట్టి శుక్రవారం నివేదిక విడుదల చేసింది.  ఏడీఆర్‌ నివేదిక ప్రకారం రాజస్తాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీలు మారారు.

అందులో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా, ధోలాపూర్‌ ఎమ్మెల్యే శోభారాణి కుషా్వహాను బీజేపీ తమ పార్టీ నుంచి బహిష్కరించింది. కాగా, మొత్తం 199 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో 46 (23%) మంది తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో ప్రకటించారు. తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు 28 (14%) సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ప్రకటించారు. పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 108 మంది ఎమ్మెల్యేలలో 27 (25%) మంది, బీజేపీకి చెందిన 69 మంది ఎమ్మెల్యేల్లో 11 (16%) మంది, సీపీఎంలోని ఇద్దరు ఎమ్మెల్యేల్లో 2 (100%), 14 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఆరుగురు (43%) ఎమ్మెల్యేలు అఫిడవిట్లలో తమపై క్రిమినల్‌ కేసులను ప్రకటించారు.  

మొత్తం 199 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 157 మంది (79%) కోటీశ్వరులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి 88 (81%) మంది, బీజేపీ నుంచి 54 (78%) మంది, స్వతంత్ర ఎమ్మెల్యేల్లో 12 (86%) మంది కోటీశ్వరులుగా తమ ఆస్తులను ప్రకటించారు. ఒక్కో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆస్తుల సగటు రూ.7.49 కోట్లుగా ఉంది. కాగా, కాంగ్రెస్‌లో ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తులు రూ.9.28 కోట్లు, బీజేపీలో ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ.5.45 కోట్లుగా ఉంది. అయితే మొత్తం ఎమ్మెల్యేల్లో 59 (30%) ఎమ్మెల్యేలు తమ విద్యార్హత 5 తరగతి నుంచి 12 తరగతి మధ్య ఉన్నట్లు ప్రకటించారు.

128 మంది (64%) ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్‌ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నట్లు ప్రకటించారు. వయస్సు పరంగా చూస్తే 80 (40%) మంది ఎమ్మెల్యేలు తమ వయస్సు 25 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్నట్లు, 119 (60%) మంది ఎమ్మెల్యేలు తమ వయస్సు 51 నుంచి 85 సంవత్సరాల మధ్య ఉన్నట్లు ప్రకటించారు. కాగా ఏడీఆర్‌ విశ్లేషించిన మొత్తం 199 ఎమ్మెల్యేల్లో 27 (14%) మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)