Breaking News

నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు

Published on Sun, 10/22/2023 - 04:27

సీఎం కేసీఆర్‌తో కామారెడ్డి నియోజకవర్గంలో తలపడేందుకు రెడీ అయిన బీజేపీ నేత, జెడ్పీ మాజీ చైర్మన్‌ కాటిపల్లి  వెంకటరమణారెడ్డి.. విభిన్నమైన ఆలోచనలు చేస్తున్నారు. రూ. 150 కోట్ల సొంత  డబ్బుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు. శనివారం ఆయన కామారెడ్డిలో సొంత మేనిఫెస్టోను ప్రకటించారు.  – సాక్షి, కామారెడ్డి

మేనిఫెస్టో ఇలా..
♦ కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో రెండెకరాల విస్తీర్ణంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించి అందులో ఆధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తా. ఇందుకోసం రూ.8 కోట్లు అవుతాయి.
♦ రెండెకరాల్లో మోడల్‌ స్కూల్‌ నిర్మించి ఇంటర్‌ వరకు విద్య అందిస్తాం. పిల్లల కోసం రవాణా సౌకర్యం కూడా కల్పిస్తాం. దీనికి రూ.5.60 కోట్లు వెచ్చిస్తా. 
♦ రూ.2 కోట్లతో రైతు సేవా కేంద్రం, రూ.­కోటిన్నరతో క్రీడా ప్రాంగణం, రూ.కోటితో ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తా. 
♦ రాజంపేట, పాల్వంచ, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు మండల కేంద్రాల్లో రూ.8.25 కోట్ల చొప్పున వెచ్చించి జనరల్‌ ఆస్పత్రి, మోడల్‌ స్కూల్, క్రీడా శిక్షణ కేంద్రం, రైతు సేవా కేంద్రం, ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తా.

ప్రజా ఉద్యమాలతో గుర్తింపు..
వెంకటరమణారెడ్డి నాలుగైదేళ్లుగా ప్రజా సమస్య­లపై ఉద్యమాలు చేస్తున్నారు. ప్రధానంగా కామారెడ్డి మున్సిపాలిటీలో మాస్టర్‌ ప్లాన్‌ వల్ల ప్రజలు, రైతులకు జరిగే నష్టంపై ఆయన చేసిన పోరాటం సంచలనమై రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలకు వ్యాపించింది.

ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పైరవీలకు తావులేకుండా ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించి అందరి మన్ననలు పొందారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్‌ హాళ్లకు ఇప్పటివరకు సుమారు రూ.50 కోట్ల వరకు విరాళం అందించారు. రాజకీయాల కోసం కాకుండా సేవ చేయాలన్న లక్ష్యంతో సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నానని, తన ఆస్తులు అమ్మి అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని వెంకటరమణారెడ్డి పేర్కొంటున్నారు.

మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ స్ఫూర్తి..
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్‌లు నాకు స్ఫూర్తి. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అహర్నిశలు పాటుపడిన అరుదైన నాయకుడు వైఎస్సార్‌. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం, వారితో కలిసి ఫొటో దిగడం ద్వారా ఎంతో మందికి ఆయన చేరువయ్యారు. నేను గెలిచినా, ఓడినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తా. – వెంకటరమణారెడ్డి, బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)