Breaking News

ఢిల్లీలో 162 మంది పోటీ.. 148 మంది డిపాజిట్లు గల్లంతు

Published on Wed, 06/05/2024 - 09:52

ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడి నుంచి పోటీ చేసిన మొత్తం 162 మంది అభ్యర్థుల్లో 14 మందిని మాత్రమే ప్రజలు ఆమోదించారు. మిగిలిన 148 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఢిల్లీలో అత్యధిక ఓటింగ్ శాతం తూర్పు ఢిల్లీ స్థానంలో 62.89గా నమోదయ్యింది. న్యూ ఢిల్లీ స్థానంలో అత్యల్పంగా 55.43 శాతం ఓటింగ్ నమోదైంది.

న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో ఎవరైనా అభ్యర్థి డిపాజిట్‌ను కాపాడుకోవాలంటే వారికి 1,40,891 ఓట్లు అవసరం. అదే తూర్పు ఢిల్లీ స్థానంలో అయితే 2,58,180 ఓట్లు అవసరం. ఎన్నికల్లో పోటీ చేసే  అభ్యర్థులు తమ డిపాజిట్‌ను కాపాడుకునేందుకు మొత్తం ఓట్లలో 1/6 ఓట్లు పొందాలి. పోలింగ్ రోజున ఢిల్లీలోని 1,52,01,936 మంది ఓటర్లలో 58.69శాతం అంటే 89,23,536 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఢిల్లీలోని ఏడు స్థానాల్లో న్యూఢిల్లీలో అత్యల్పంగా 8.45 లక్షల మంది ఓటర్లున్నారు. ఇక్కడ నిబంధనల ప్రకారం డిపాజిట్ కాపాడుకోవడానికి అభ్యర్థికి 1,40,891 లక్షల ఓట్లు అవసరం. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానానికి 17 మంది అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. వీరిలో బన్సూరి స్వరాజ్, సోమనాథ్ భారతికి 1.4 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. మిగిలిన 15 మంది అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్‌ గల్లంతయ్యింది.

అత్యధిక ఓట్లు పొందిన ఈశాన్య ఢిల్లీ స్థానంలోని 24,63,159 మంది ఓటర్లలో 15,49,80 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ స్థానంపై అభ్యర్థులు తమ డిపాజిట్ కాపాడుకోవడానికి 2,58,180 ఓట్లు అవసరం. ఈశాన్య ఢిల్లీ స్థానానికి 28 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వారిలో మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్ మినహా 26 మంది అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్ గల్లంతయ్యింది. మిగిలిన ఐదు స్థానాల్లో బీజేపీ, మహాకూటమి అభ్యర్థులు మినహా మిగిలిన వారందరినీ ప్రజలు తిరస్కరించారు.

ఢిల్లీ మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఆయన బహుజన సమాజ్ పార్టీ టిక్కెట్‌పై న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 5,629 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇది 0.66 శాతం మాత్రమే. రాజ్‌కుమార్ ఆనంద్‌కు పోస్టల్‌ ఓటు ద్వారా 28 ఓట్లు రాగా, ఈవీఎంల ద్వారా 5,601 ఓట్లు వచ్చాయి. గతంలో ఢిల్లీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆనంద్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన న్యూఢిల్లీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)