ఇకపై పరీక్షల్లో కాపీకొట్టి పట్టుబడితే జైలుకే..  

Published on Fri, 08/04/2023 - 14:02

రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ గురువారం  రోజున సంచలనాత్మక  బిల్లును ఆమోదించింది.  ఇకపై పరీక్షల్లో కాపీ కొట్టి పట్టుబడితే 10 కోట్లు జరిమానాతో పాటు జీవిత కాలం జైలు శిక్ష కూడా విధించేలా చట్టాన్ని రూపొందించి అమలు చేయనుంది.  

ఏమిటీ బిల్లు.. 
గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అలాంగిర్ అలాం ఈ బిల్లును ప్రవేశపెట్టగా దీనిపై సుదీర్ఘంగా చర్చ కూడా సాగింది. ఇకపై ఎవరైనా పోటీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడితే వారికి 10 కోట్లు జరిమానా తోపాటు జీవితకాలం ఖైదు చేసే విధంగా చట్టాన్ని రూపొందించారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేయడాన్ని క్షమించరాని నేరంగా పరిగణిస్తూ నాన్ బెయిలబుల్ కేసుగా నమోదు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు.    

అనర్హులకు చెక్.. 
ఆయా నియామకాలకు సంబంధించి జరిగే కాంపిటీటివ్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా  నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ చట్టం ద్వారా పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్  చేసేవారికి కఠినమైన హెచ్చరికలు జారీ చేసినట్టయ్యింది. ఇంతకాలం పరీక్షల నిర్వహణలో అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న లొసుగులను సద్వినియోగం చేసుకుంటూ గతంలో కొందరు అభ్యర్థులు పరీక్షల్లో అవకతవకలకు  పాల్పడ్డారని, అందుకే ఈ తరహా కఠిన చట్టాలను రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపాయి ప్రభుత్వ వర్గాలు. మరోపక్క బీజేపీ పార్టీ ఎప్పటిలాగే దీన్నొక క్రూరమైన చట్టంగా వర్ణించింది.   

సీఎం కామెంట్..  
దీనిపై స్వయంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలను ఎలా తయారు చేస్తోందో అందరూ చూస్తున్నారని.. ఇలాంటి చట్టం చేయడం ఇదే మొదటిసారి కాదని, మరికొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. అలాగే జైలు శిక్షను కూడా కుదిస్తూ మొదటిసారి పట్టుబడితే ఏడాదిపాటు.. రెండోసారి పట్టుబడితే మూడేళ్లపాటు ఉండేలా సవరణలు చేశారు. 

ఇది కూడా చదవండి: విపక్షాల కూటమికి షాక్.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)