Breaking News

జోహన్నెస్‌బర్గ్‌లో వైఎస్సార్‌ వర్ధంతి.. ప్రత్యేక సేవా కార్యక్రమం

Published on Thu, 09/03/2026 - 12:31

జోహన్నెస్‌బర్గ్‌: మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ సౌత్‌ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లో సేవా కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ సౌత్‌ ఆఫ్రికా కన్వీనర్‌ విక్రమ్‌రెడ్డి పెట్లూరు ఆధ్వర్యంలో ఈడెన్వేల్‌లోని ‘ది లిటిల్‌ ఈడెన్‌’లో కార్యక్రమం జరిగింది. ప్రత్యేక అవసరాలు కలిగిన వారి సంక్షేమం, సహాయార్థం నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో పలువురు పాల్గొని తమ వంతు సహాయాన్ని అందించారు. సేవా భావం, మానవత్వం, సమాజం పట్ల బాధ్యతను చాటేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించి, స్వయంగా పాల్గొని విజయవంతం చేసిన నరసింహరెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్‌ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్‌రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్‌రెడ్డి ఏనుముల, హరీష్‌ గోరంట్ల, శ్రావణి పెట్లూరు, కరుణా బసిరెడ్డి, సుమన్‌ చిట్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి సేవా స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పడంతో పాటు ఆయన ఆశయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ సౌత్‌ ఆఫ్రికా ప్రతినిధులు తెలిపారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)