Breaking News

బ్రిటన్, కువైట్‌లో వైఎస్‌ జగన్‌ ముందస్తు పుట్టినరోజు

Published on Sat, 12/20/2025 - 06:10

వేంపల్లె/కడప కార్పొరేషన్‌: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ముందస్తు పుట్టినరోజును యునైటెడ్‌ కింగ్‌డమ్‌ బ్రిటన్‌లో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించినట్లు వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్‌ కో–ఆర్డినేటర్లు ఆలూరి సాంబశివారెడ్డి, డాక్టర్‌ చింతా ప్రదీప్‌ రెడ్డి, ఎల్‌.ఎన్‌.జగదీశ్వర్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనం మెచ్చిన నాయకుడిగా, జననేతగా మాజీ సీఎం వైఎస్‌ ప్రఖ్యాతి పొందారన్నారు. ఆయన పుట్టినరోజును బ్రిటన్‌లో నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ యూకే కన్వీనర్లు సహాయ కన్వీనర్లు, కోర్‌ కమిటీ సభ్యులు, మహిళా విభాగం సభ్యులు, పెద్ద ఎత్తున యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

కువైట్‌లో మెగా రక్తదానం 
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందస్తు పుట్టినరోజు వేడుకలు కువైట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కువైట్‌ కమిటీ ఆధ్వర్యంలో కువైట్‌లోని జాబ్రియా బ్లడ్‌ బ్యాంకులో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్‌ కన్వీనర్‌ ఎ.సాంబశివారెడ్డి, గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌. ఇలియాస్, కువైట్‌ కన్వీనర్‌ ముమ్మడి బాలిరెడ్డి  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

 

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కువైట్‌లో ఉన్న జగనన్న అభిమానులు భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చారని, కువైటీల ఇళ్లలో పని చేస్తున్న మహిళలు, డ్రైవర్లు అనుమతి తీసుకొని వచ్చి 82 మంది  రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. రక్తదానం చేసిన వారికి జగనన్న సంతకంతో కూడిన సరి్టఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్‌ కో–కన్వీనర్‌ గోవిందు నాగరాజు, కువైట్‌ కో కన్వీనర్లు కె. రమణయాదవ్, మర్రి కళ్యాణ్, షా హుసేన్, గల్ఫ్‌ కోర్‌ కమిటీ సభ్యులు పులపత్తూరు సురేష్‌ రెడ్డి, గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు ఎస్‌. లక్ష్మీ ప్రసాద్‌ యాదవ్, షేక్‌ రహమతుల్లా, షేక్‌ అఫ్సర్‌ అలీ, కార్యవర్గ సభ్యులు షేక్‌ యాసిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)