Breaking News

కెనడాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు

Published on Tue, 09/09/2025 - 18:26

విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుంటూ పండగలు, ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తాజాగా గణేష్ ఉత్సవాలను కెనడాలో స్థిరపడిన భారతీయులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఒంటారియో రాష్ట్రం ఓక్ విల్లే పట్టణంలో తెలుగువారి కుటుంబాలన్నీ ఒక్క చోట చేరి గణేష్ ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకున్నారు. టీమ్ యువ పేరుతో ఏర్పాటైన సంఘం ఆధ్వర్యంలో యువకులంతా ఒక జట్టుగా గణనాధుడి వేడుకలను కనులపండగగా నిర్వహించారు.

పుట్టిన గడ్డకు సుదూరంలో ఉన్నా ఇక్కడ సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తున్నామని, రానున్న తరాలైన తమ పిల్లలకు భారతీయ పండగల విశిష్టత తెలిసేలా నిర్వహిస్తున్నామని టీమ్ యువ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉత్సవాలకు ఓక్ విల్లే  పార్లమెంట్ మెంబర్ సిమా అకన్, మేయర్ రాబ్ బుర్టన్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.  భారతీయుల పండగలు కలర్ ఫుల్ గా ఉంటాయని మెచ్చుకున్నారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఉత్సవాల కోసం ప్రత్యేక సందేశం పంపారు. భిన్నత్వంలో ఏకత్వమనే సందేశాన్ని గణేష్ నవరాత్రులు నిరూపిస్తాయని ఆమె తెలిపారు.

ఆనందోత్సహాల మధ్య జరిగిన ఈ వేడుకలకు రఘు యాదవ్, మధు రెడ్డి, హరీశ్వర్, వెంకట్, శివకుమార్, అభిలాష్, అరుణ్ రెడ్డి, మనీష్, దినేష్, సృజన్ తదితరుల నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ అన్ని ఏర్పాట్లు చేసి విజయవంతం చేసింది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)