Breaking News

కూతురికి స్విమ్‌ చేయడం నేర్పిస్తూ..పాపం ! ఆ తండ్రి..

Published on Wed, 06/28/2023 - 14:18

ఒక్కసారి కొన్ని ఘటనలు చూస్తే విధి లిఖితమో లేక అనుకోకుండా జరిగిందో అర్థం కావు. మనకళ్ల ముందే అప్పటి వరకు హాయిగా ఉన్నవారు హఠాత్తుగా ఇక లేరు అంటే..  నమ్మశక్యం కాదు. వారితో మనకు ఎలాంటి సంబంధం లేకున్నా బాధనిపిస్తుంది. అలాంటి షాకింగ్‌ ఘటనే US అమెరికా కుపర్టినోలో ఉంటున్న NRI కుటుంబంలో జరిగింది. 

అప్పటి వరకు హాయిగా నవ్వుతూ తుళ్లుతూ తిరిగారు ఆ తండ్రి కూతుళ్లు. అనుకోని ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. USలో ఉంటున్న మద్ది రామయ్య ప్రత్తి, తన భార్య పద్మ, ఏడేళ్ల కూతురితో కుపర్టినోలో ఓ అపార్టమెంట్‌లో నివశిస్తున్నారు. తన కుమార్తెను స్విమ్మింగ్‌ చేయించడం కోసం అపార్ట్‌మెంట్‌ కమ్యూనిటిలో ఉన్న స్మిమ్మింగ్‌పూల్‌ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ తన బిడ్డ స్విమ్‌ చేస్తుండగా పక్కనే వేచి చూస్తున్నారు. ఇంతలో పాప కోసం స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్లిన రామయ్య హఠాత్తుగా నీళ్లలో పడిపోయారు. రామయ్యను పూల్ నుంచి బయటకు తీసేలోగా నీళ్లు మింగేశారు. 

రామయ్యను క్రిటికల్‌ కేర్‌ ఎమర్జెన్సీ యూనిట్‌కి తరలించినా ఫలితం లేకపోయింది. సుమారు 4 రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉండి ప్రాణాలతో పోరాడి చివరికి మృత్యు ఒడికి చేరుకున్నాడు. ఈ ఘటనతో ఆ అపార్ట్‌మెంట్‌ వాసులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాధితుడి మృతదేహాన్ని భారత్‌ తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు అతని బంధువులు. కష్టకాలంలో ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు gofundme వెబ్ సైట్ ద్వారా విరాళాల సేకరణ ప్రారంభించారు. కనీసం 3లక్షల డాలర్లు (దాదాపు రెండున్నర కోట్ల రుపాయలు) లక్ష్యంగా పెట్టుకుని విరాళాలను ఆర్ధించగా.. ఇప్పటివరకు లక్షా 67వేల డాలర్లు (దాదాపు కోటి 36 లక్షల రుపాయలను) సేకరించారు. ఈ మొత్తాన్ని ఆస్పత్రి బిల్లుకు, అంత్యక్రియల కోసం వెచ్చించారు.

మద్ది రామయ్య ప్రత్తి అంత్యక్రియలను ఇవ్వాళ (బుధవారం) నిర్వహించారు. 

(చదవండి: నాటా వేడుకలకు వేళాయె!)

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)