సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

Published on Fri, 03/20/2026 - 12:22

సింగపూర్‌: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్‌లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.  వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ  వారు చేస్తున్న కార్యక్రమాలు  స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.

ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్,  దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి  ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు.  

ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల,  భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.

 

Videos

సిగ్గుచేటు.. గరికపాటి గుడ్డు వివాదం

ఆపరేషన్ ముగించే సమయం ఆసన్నమైంది.. ట్రంప్ సంచలన ప్రకటన

రోడ్లపైకి టెస్లా సెమీ ట్రక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 800 KM

పాలు పితుకుతున్నావా..? గాడిదలు కాస్తున్నావా..?

ప్లాన్ మార్చిన అమెరికా.. ట్రంప్ టార్గెట్ ఏంటంటే?

షర్మిల నీ కొడుకును అలా అన్నందుకు కొంచెం కూడా భాద అనిపించలేదా తల్లి..?

చంద్రబాబు టీటీడీ ల్యాబ్ క్రెడిట్ చోరీ

మరో సంచలన వీడియోతో అరవ శ్రీధర్ బాధితురాలు

షర్మిల భర్త అనిల్ ఆయన చెల్లెళ్ళకు సగం ఆస్తి పంచాడా...?

ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు

Photos

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)