Breaking News

అమెరికాలో మెరిసిన తెలుగు తేజం

Published on Tue, 06/09/2026 - 15:57

టాంపా, ఫ్లోరిడా:  అమెరికా జాతీయ స్థాయి ఇన్నోవేషన్ పోటీలో టాంపా తెలుగమ్మాయి విశేషగా నిలిచింది. అమెరికా స్టెయిన్‌ బ్రెన్నర్ హైస్కూల్ (ఫ్లోరిడా)లో 10వ తరగతి చదువుతున్న తెలుగు విద్యార్థిని ఇషాన్వి సబ్నివీసు అమెరికా జాతీయ స్థాయి ఇన్నోవేషన్ పోటీలో ద్వితీయ బహుమతి సాధించింది. 

అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యార్థుల ఆవిష్కరణల పోటీలలో ఒకటైన ఇన్వెన్షన్ కన్వెన్షన్ యూఎస్ నేషనల్స్‌లో, 35 రాష్ట్రాల నుండి పాల్గొన్న 3 లక్షల మందికి పైగా విద్యార్థులతో పోటీపడి ఆమె ఈ ఘనత సాధించింది. దృష్టి లోపం ఉన్నవారి కోసం రూపొందించిన “ఏఐ-ఎనేబుల్డ్ స్మార్ట్ కేన్ (Smart Cane)” అనే వినూత్న ఆవిష్కరణకు గాను ఆమెకు  జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే పేటెంట్ దరఖాస్తు దశలో ఉంది. ఇషాన్వి జాతీయ స్థాయి ప్రయాణం యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో జరిగిన ప్రాంతీయ ఇన్వెన్షన్ కన్వెన్షన్ నుండి ప్రారంభమైంది.

స్మార్ట్ కేన్ ప్రత్యేకతలు
ఈ స్మార్ట్ కేన్ దృష్టి లోపం ఉన్న వ్యక్తులు స్వతంత్రంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు సహాయపడేలా ఆధునిక AI సాంకేతికతతో రూపొందించబడింది.

రియల్ టైమ్ AI ఆధారిత వాతావరణ విశ్లేషణ వ్యవస్థ
ఆన్-డివైస్ (Large Language Models) ద్వారా ప్రాసెసింగ్
బ్లూటూత్ ఇయర్‌పీస్ ద్వారా వాయిస్ మార్గనిర్దేశం
ఇంటర్నెట్ అవసరం లేకుండా పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పనిచేసే సామర్థ్యం క‌లిగి ఉంటుంది
అడ్డంకులను ముందుగానే గుర్తించే (Obstacle Detection) వ్యవస్థ
తప్పు గుర్తింపులను తగ్గించే False Detection Suppression టెక్నాలజీ
ఒకే టచ్‌తో అత్యవసర కాల్స్ చేసే ఎమర్జెన్సీ ఫీచర్

గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా ఇది సమర్థవంతంగా ఉపయోగపడే విధంగా రూపొందించబడింది. అంతేకాకుండా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మద్దతుగా ‘క్రానిక్ కనెక్ట్’ అనే నాన్-ప్రాఫిట్ కమ్యూనిటీని కూడా ఆమె స్థాపించారు. ఇషాన్వి విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగువారంతా ఆనందం వ్యక్తం చేశారు.  ఆమె సాధించిన విజయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. మరోవైపు తెలుగు సమాజానికి గర్వకారణమవుతుంద‌ని విధ్యార్దిని ఇషాన్వి సబ్నివీసు తెలిపింది.

దీనికి హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ స్టార్టప్ క్వాడ్రిక్ ఐటీ యువ ఆవిష్కర్తలకు AI, టెక్నాలజీ మార్గదర్శకత్వం, సాంకేతిక సహాయం అందిందించింది. ఇషాన్వి లాంటి యువ ఆవిష్కర్తలు ప్రపంచ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందిస్తూ భవిష్యత్ టెక్నాలజీ దిశను నిర్దేశిస్తుందని నిర్వాహకులు ప్రకటించారు.

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)